ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కొంపదీసి ఆమె భర్త విడాకులు ఇస్తాడా ఏంటి..?.. పెళ్లి వేడుకలో ఈ మహిళ డాన్స్ చూసి నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

ABN, First Publish Date - 2023-06-02T21:16:32+05:30

కొందరు పైకి బిడియ పడుతూ కనిపించినా.. సమయం వచ్చినప్పుడు వారిలోని టాలెంట్‌ను బయటపెడుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. చాలా మంది మహిళలు కూడా తమ టాలెంట్‌కి పదును పెట్టి వీడియోలు చేయడం కామన్ అయిపోయింది. ఇంకొందరు మహిళలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు పైకి బిడియ పడుతూ కనిపించినా.. సమయం వచ్చినప్పుడు వారిలోని టాలెంట్‌ను బయటపెడుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. చాలా మంది మహిళలు కూడా తమ టాలెంట్‌కి పదును పెట్టి వీడియోలు చేయడం కామన్ అయిపోయింది. ఇంకొందరు మహిళలు అందరి ముందూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ మహిళ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేడుకలో మహిళ డాన్స్ చూసి నెటిజన్లు.. కొంపదీసి ఆమె భర్త విడాకులు ఇస్తాడా ఏంటి..? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వివాహ వేడుకలో డీజే పాటలకు (DJ songs in wedding ceremony) అతిథులంతా డాన్సులు వేస్తుంటారు. ఇంతలో చీర కట్టుకున్న ఓ మహిళ (woman) అక్కడికి వస్తుంది. చూడటానికి వచ్చి ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. సదరు మహిళ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోతుంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (Bollywood hero Hrithik Roshan) చిత్రంలోని 'బ్యాంగ్ బ్యాంగ్' పాటకు స్టెప్పులు వేస్తుంది. డాన్స్ రాకున్నా.. ఎలాగైనా వేసి చూపించాలి అనుకుందో ఏమో గానీ.. ఇష్టం వచ్చినట్లు (Woman dance) స్టెప్పులు వేసింది.

Viral: స్కూటీలో పెట్రోల్ కొట్టించుకుని డబ్బుల్లేవన్న 15 ఏళ్ల పిల్లాడు.. ఏం అడిగినా నో రెస్పాన్స్.. అనుమానంతో పేపర్‌పై రాయమని అడిగితే..

ధమేల్‌మని కింద పడుతూ, మోకాళ్ల మీద ముందుకు జరుగుతూ.. ఇలా అందరినీ భయపెడుతూ డాన్స్ వేసింది. ఈమె డాన్స్ చూసి పక్కన ఉన్న వాళ్లు కూడా అవాక్కయ్యారు. ఆమె స్నేహితులు మాత్రం చుట్టూ నిలబడి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. అక్కడే ఉన్న వారు ఈమె డాన్సును వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! భయకంర డాన్సు’’.. అంటూ కొందరు, ‘‘ఈమె డాన్సు చూశాక.. భర్త విడాకులు ఇస్తాడేమో’’.. అని మరికొందరు, ‘‘డాన్సు రాకున్నా.. బాగానే ప్రయత్నించింది’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.

Wife: రెండేళ్ల క్రితమే పెళ్లి.. రోజూ షాపింగ్‌కే రూ.70 లక్షలు ఖర్చు చేస్తోందట.. ఈమె భర్త ఎవరో.. అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే..!

Updated Date - 2023-06-02T21:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising