ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mumbai Local Train: ముంబై లోకల్ ట్రైన్‌లో యువతి హల్‌చల్.. ఐటమ్ సాంగ్‌కి స్టెప్పులు.. చివరికి సీన్ కట్ చేస్తే..

ABN, First Publish Date - 2023-09-20T17:02:41+05:30

మెట్రో లేదా లోకల్ రైళ్లు ఉన్నది ఎందుకు? ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించేందుకు, తమ గమ్యస్థానానికి ప్రజలు త్వరగా చేరుకోవడానికి ఇవి పనికొస్తాయి. కానీ.. నేటి యువత దీనిని తమ ట్యాలెంట్ చూపించుకునే అడ్డా...

మెట్రో లేదా లోకల్ రైళ్లు ఉన్నది ఎందుకు? ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించేందుకు, తమ గమ్యస్థానానికి ప్రజలు త్వరగా చేరుకోవడానికి ఇవి పనికొస్తాయి. కానీ.. నేటి యువత దీనిని తమ ట్యాలెంట్ చూపించుకునే అడ్డాగా మార్చేసుకుంది. ఢిల్లీ మెట్రోలో వెలుగుచూస్తున్న నిర్వాకాల గురించి అందరికీ తెలిసిందేగా! ప్రేమికులు ఈ మెట్రోను లవర్స్ పార్క్‌గా మార్చేస్తే.. ఇన్‌ఫ్లుయెన్సర్లు విచిత్రమైన వీడియోలు చేయడానికి తమ ప్రాపర్టీగా వాడుకుంటున్నారు. రైళ్లల్లో వీడియోలు చేస్తే, రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వొచ్చన్న ఆలోచనతో వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కల్చర్ ముంబైకి కూడా పాకింది. ఓ లోకల్ ట్రైన్‌లో ఒక యువతి ఐటమ్ సాంగ్‌కి స్టెప్పులేసింది.


ఆ యువతి పేరు ఆలియా మిర్జా. డ్యాన్స్ అంటే ఈమెకు ఎంతో పిచ్చి. అందుకే.. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో డ్యాన్స్ చేసే వీడియోలను తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకూ ఎన్నో ప్రదేశాల్లో డ్యాన్స్ చేసిన వీడియోల్ని ఈ యువతి పోస్ట్ చేసింది. ఇప్పుడు కొత్తగా ముంబై లోకల్ ట్రైన్‌లో ఓ ఐటమ్ సాంగ్‌కి చిందులేసింది. ‘కబ్ తు ఆయేగా, ఇత్నా బతాదే’ అనే రీమిక్స్ పాటకు ఆమె స్టెప్పులేసింది. డ్యాన్స్ పరంగా ఆమె ట్యాలెంట్‌ని మెచ్చుకోవచ్చు కానీ.. ఎంచుకున్న ప్రదేశమే సరైనది కాదు. ట్రైన్ అనేది ఒక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. పైగా.. ఇందులో తన నడుము కనిపించేలా దుస్తులు ధరించింది. అంతేకాదు.. కదులుతున్న రైలులో డోర్ వద్ద ఉండే సపోర్టింగ్ రాడ్‌ పట్టుకొని బెల్లీ డ్యాన్స్ చేసింది. శాండ్ హర్ట్స్ రోడ్, మస్‌జిద్ స్టేషన్ల మధ్య లోకల్ రైలులో ఆ యువతి డ్యాన్స్ చేసినట్లు తేలింది.

ప్రస్తుతం ట్విటర్‌లో (X ప్లాట్‌ఫామ్) వైరల్ అవుతున్న ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె ట్యాలెంట్‌ని మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు కానీ, ఇతరులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైల్వే స్టేషన్‌లలో రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితికి ఈ వీడియో నిదర్శనమని విమర్శలు గుప్పించారు. ముంబై లోకల్ ట్రైన్స్ ఇప్పుడు ముంబై ఢిల్లీ మెట్రోగా మారాయని అంటున్నారు. ఈ యువతిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయినా.. తమ ట్యాలెంట్ చూపించుకోవడానికి ట్రైన్లే దొరికాయా? అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఏదేమైనా.. ఈ వీడియోతో మాత్రం ఆ యువతి పాపులర్ అయిపోయింది.

Updated Date - 2023-09-20T17:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising