ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Woman: అమ్మ బాబోయ్.. ఈ మహిళ యవ్వారం మామూలుగా లేదుగా.. పోలీసు అధికారిపైనే కేసు పెట్టింది.. అసలు కథేంటంటే..!

ABN, First Publish Date - 2023-11-07T14:06:09+05:30

అవినీతిని అరికట్టడం, శాంతిభద్రతల కోసం పాటుపడటం పోలీసుల ప్రథమ కర్తవ్యం. కానీ కొన్నిసార్లు పోలీసులకు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి.

పోలీసులు చట్టాన్నికాపాడుతూ సమాజంలో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా కాపాడటంలో తమ వంతు కృషి చేస్తుంటారు. అవినీతిని అరికట్టడం, శాంతిభద్రతల కోసం పాటుపడటం పోలీసుల ప్రథమ కర్తవ్యం. కానీ కొన్నిసార్లు పోలీసులకు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. వారు చేసేపనులు వారికి పెద్ద చిక్కులే తెచ్చిపెడుతుంటాయ. ఓ పోలీసు అధికారి విషయంలోఓ మహిళ ప్రవర్తన దీనికి చక్కని ఉదహారణ. ఓ మహిళ ఏకంగా పోలీసు అధికారిపైనే పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఆమె ఫిర్యాదు వెనుక కారణం తెలిసి పోలీసులే నివ్వెరపోయారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం, గ్వాలియర్ లో పాడవ్ పోలిస్ స్టేషన్ సబ్ ఇన్ఛార్జికి సోషల్ మీడియాలో ఓ మహిళ పరిచయమైంది. వారిద్దరూ సోషల్ మీడియాలో తెగ ఛాటింగ్ చేసుకునేవారు. ఆ తరువాత వారిద్దరూ నేరుగానే కలిశారు. అప్పటినుండి వారిద్దరూ వీలైనప్పుడల్లా కలుస్తూ ఉండేవారు. వారిద్దరూ కలిసిన సమయంలో కొన్ని అభ్యంతకరమైన సందర్భాలను ఆ మహిళ సీక్రెట్ గా రికార్డ్ చేసింది. దీనికోసం ఆమె సోదరుడు, తన స్నేహితురాలి సహాయం తీసుకుంది. ఆ తరువాత ఆ యువతి సబ్ ఇంఛార్జీ కి రికార్డ్ చేసిన వీడియోలు పంపి 5లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. డబ్బు ఇవ్వకపోతే వీడియోలు బహిర్గతం చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో ఆ సబ్ ఇంఛార్థీ ఆమెకు భయపడి 5లక్షల రూపాయలు ఇచ్చాడు.

ఇది కూడా చదవండి: Garlic Onion Peel: ఉల్లిపాయలు, వెల్లిపాయల పొట్టును డస్ట్‌బిన్‌లో పారేస్తున్నారా..? ఈ నిజాలు తెలిస్తే జాగ్రత్తగా దాచిపెడతారేమో..!



కొన్నిరోజుల తరువాత ఆ మహిళ తన సోదరుడు, తన స్నేహితురాలిని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్ కే వెళ్లింది. తనకు మరింత డబ్బు ఇవ్వకపోతే అత్యాచారం కేసు నమోదు చేస్తానని బెదిరించింది. అలా చేస్తే పోలీసు అధికారి తమకు మరింత డబ్బు ఇస్తాడని వారు భావించారు. కానీ అక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది., పోలీసు అధికారి బ్లాక్మెల్ గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సదరు మహిళను, ఆమె సోదరుడిని, ఆమె స్నేహితురాలిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రూ. 2.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కాగా స్టేషన్ ఇంఛార్జీ మీద ఆ మహిళ లైంగిక ఆరోపణలు చేసిన నేపధ్యంలో ఆమె ఆరోపణలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. కేసు విచారణ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: Roti Making Mistakes: చపాతీ పిండిని కలిపేటప్పుడు.. చాలా మంది తెలియక చేస్తున్న బిగ్ మిస్టేక్స్ ఇవే..!


Updated Date - 2023-11-07T14:06:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising