Shocking: రోజూ తలనొప్పి.. వాంతులు అవుతుంటే లైట్ తీసుకుంది.. కానీ చివరకు ఆమె పరిస్థితి ఏంటంటే..!
ABN, First Publish Date - 2023-10-20T14:01:18+05:30
ఆరోగ్యం (Health) విషయంలో ఎప్పుడూ అలసత్వం ప్రదర్శించకూడదు. ఒక్కొసారి చిన్న తలనొప్పి కూడా పెద్ద ప్రాణాంతక వ్యాధి లక్షణం కావొచ్చు. అంటే.. అన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుందని కాదు. కాకపోతే కంటిన్యూస్‌గా ఇలాగే జరిగితే మాత్రం అనుమానించాల్సిందే.
Shocking: ఆరోగ్యం (Health) విషయంలో ఎప్పుడూ అలసత్వం ప్రదర్శించకూడదు. ఒక్కొసారి చిన్న తలనొప్పి కూడా పెద్ద ప్రాణాంతక వ్యాధి లక్షణం కావొచ్చు. అంటే.. అన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుందని కాదు. కాకపోతే కంటిన్యూస్‌గా ఇలాగే జరిగితే మాత్రం అనుమానించాల్సిందే. లేనిపక్షంలో పరిస్థితులు చేయి జారిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇలా ఈ ఒక్క తలనొప్పి (Headache) విషయంలోనే కాదు ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య అయినా సరే.. పదేపదే కలుగుతుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదు. ఎందుకంటే ఆస్ట్రేలియా (Australia) లోని సిడ్నీకి చెందిన 21 ఏళ్ల యువతి విషయంలో ఇలాగే జరిగింది. రోజూ తలనొప్పి, వికారం, వాంతులు (Vomitting) అవుతుంటే ఆమె లైట్ తీసుకుంది. కానీ, చివరికి ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా క్లిష్టంగా మారిపోయింది. వైద్యులు కూడా ఆమె ప్రస్తుతం చాలా డేంజర్ సిట్యూవేషన్‌లో ఉందని తెలియజేశారు. ఇంకా చెప్పాలంటే ప్రాణాలతో పోరాడాల్సిందేనని తేల్చి చెప్పారు. అసలు యువతికి వచ్చిన జబ్బు ఏంటి? రోజువారీ తలనొప్పి, వాంతులు ఎందుకంత డేంజరస్‌గా పరిణమించాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Shocking: సరిగ్గా ఉడకని మష్రూమ్‌లను తిన్నాడో వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..!
ఆమె పేరు జెనాయా షా (Jenaya Shaw). ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ (Sydney) లో నివాసం. తన స్నేహితుడితో కలిసి యూరోప్ టూర్‌కి వెళ్లింది. అక్కడి వెళ్లి వారం రోజుల తర్వాత తిరిగి వచ్చేశారు. అయితే, సిడ్నీ వచ్చిన తర్వాత నుంచి ఆమెకు రోజూ తలనొప్పి, వాంతులు, వికారం మొదలయ్యాయి. కానీ, ఆమె వాటిని లైట్ తీసుకుంది. టాబ్లెట్స్‌తో సరిపెట్టింది. ఈ క్రమంలో ఉన్నట్టుండి భరించలేని తలనొప్పి రావడం మొదలైంది. చేసేదీలేక ఆస్పత్రికి వెళ్లింది. జెనాయాను పరీక్షించిన వైద్యులు ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ (Brain Tumour) ఉన్నట్లు నిర్ధారించారు. అది కూడా స్టేజ్ 3. ఇంకేముంది.. గత మూడు నెలల్లో మూడు బ్రెయిన్ సర్జరీలు జరిగాయి. ఆమె కుడి కంటి చూపును కూడా కోల్పోయిందని స్నేహితుడు చెప్పాడు.
Viral News: ప్లీజ్ అంటూ వేడుకున్న కస్టమర్.. చెత్త డబ్బాలోంచి ఆ రెస్టారెంట్ ఓనర్ ఏం తీసి ఇచ్చారంటే..!
ఇక ఆమె ఆర్థిక పరిస్థితి కూడా అంతంతా మాత్రమే కావడంతో షా స్నేహితుల్లో ఒకరు ఆమె శస్త్రచికిత్సల కోసం ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా 'గోఫండ్‌మీ' (GoFundMe) ద్వారా నిధులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం జెనెయా పరిస్థితి దారుణంగా తయారైందని, ఆమె కలలన్ని తుడిచిపెట్టుకుపోయాయని స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. బ్రెయిన్ ట్యూమర్ 'స్టేజ్ 3'లో వ్యక్తి మెదడు లోపల కణితి వేగంగా పెరుగుతుందట. అలాగే శరీరంలోని సమీపంలోని కణజాలాలకు కూడా అంతే వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నమాట. అంతేగాక ఈ దశలో కణితి కణాలు సాధారణ కణాల కంటే చాలా భిన్నంగా కనిపిస్తాయట.
Sad Love Story: బిహార్‌లో సీమా హైదర్ లాంటి లవ్‌స్టోరీ.. కానీ క్లైమాక్స్ మాత్రం విషాదాంతం..!
Updated Date - 2023-10-20T14:01:18+05:30 IST