ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: హ్యాండ్ బ్యాగు నుంచి సైకిల్‌ను బయటికి తీసిన మహిళ.. అప్పటి కాలంలోనే ఎంత టెక్నాలజీ ఉండేదో చూడండి..

ABN, First Publish Date - 2023-10-19T16:40:43+05:30

ఇప్పుడంటే టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి.. మనిషి అడుగు కదపకుండానే ఎన్నో పనులను ఈజీగా చేసేస్తున్నాడు. అయితే ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కిలోమీటర్ల దూరం కాలినడకన లేదా ఎద్దుల బండ్ల ప్రయాణం చేసేవారని అందరికీ తెలుసు. అయితే..

ఇప్పుడంటే టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి.. మనిషి అడుగు కదపకుండానే ఎన్నో పనులను ఈజీగా చేసేస్తున్నాడు. అయితే ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కిలోమీటర్ల దూరం కాలినడకన లేదా ఎద్దుల బండ్ల ప్రయాణం చేసేవారని అందరికీ తెలుసు. అయితే అప్పటి వారు కూడా టెక్నాలజీ విషయంలో ఏమాత్రం తక్కువేం కారని కొన్ని కొన్ని సంఘటనలు రుజువు చేస్తుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న ఓ వీడియోనే ఇందుకు నిదర్శనం. ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగు నుంచి బుల్లి సైకిల్‌ను బయటికి తీసింది. తద్వారా తన పాపను సైకిల్‌పై నిలబెట్టి ఈజీగా తీసుకెళ్లింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన పాపను ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్తుంటుంది. అయితే కొద్ది దూరం వెళ్లగానే పాప బరువైందో ఏమోగానీ.. బండిపై తీసుకెళ్దాం అనుకుంటుంది. కానీ ఆమె చేతిలో హ్యాండ్ బ్యాగ్ (Hand bag) తప్ప మరేమీ ఉండదు. కానీ ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తూ పాపను కిందకు దింపి తన బ్యాగులోంచి మడత పెట్టి ఉంచిన ఓ బుల్లి సైకిల్‌ను బయటకు తీస్తుంది. కిందకు దిగిన పాప కూడా తన తల్లి ఏం తీస్తుందో అని అసక్తికరంగా చూసతూ ఉంటుంది. మడత సైకిల్‌ను (woman took out a bicycle from her handbag) బయటకు తీసి, దానిపై పాపను నిలబెడుతుంది.

Viral Video: కారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన కొండ చిలువ.. గంటన్నర పాటు కష్టపడి దాన్ని ఎలా బయటకు తీశారంటే..!

తద్వారా ఎంచక్కా తన పాపను సైకిల్‌పై నిలబెట్టి లాక్కెళ్లిపోతుంది. పాప కూడా సైకిల్‌పై నిలబడి ఎంజాయ్ చేస్తూ వెళ్లడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను బట్టి అప్పట్లోనూ పిల్లల సైకిళ్లను వినూత్నంగా తయారు చేసేవారని అర్థమవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! ఎంత బాగుందో ఈ సైకిల్’’.. అని కొందరు, ‘‘బ్యాగులో పట్టే సైకిల్ భలే ఉందే’’.. అని మరికొందరు, ‘‘ఆ కాలంలోనూ ఎంతో టెక్నాలజీ ఉందన్నమాట’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..

Viral Video: యాపిల్స్ ఇచ్చుకో.. ఐఫోన్ తీసుకో.. మహిళకు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కోతి..

Updated Date - 2023-10-19T16:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising