Viral News: ఆపరేషన్ చేసుకున్నా కూడా గర్భవతిని ఎలా అయ్యానంటూ ఓ మహిళకు డౌట్.. జరిగింది తెలిసి న్యాయపోరాటం.. చివరకు..
ABN, First Publish Date - 2023-05-02T16:32:39+05:30
కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంటుంది. ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులకు ఇలాంటి అనుభవం ఎదురవుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా రోజూ ఎక్కడోచోట ఇలాంటి ఘటనలు..
కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంటుంది. ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులకు ఇలాంటి అనుభవం ఎదురవుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా రోజూ ఎక్కడోచోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మధురైకి చెందిన మహిళ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఓ మహిళ ఆపరేషన్ చేసుకున్నా కూడా గర్భవతి అయింది. చివరకు జరిగిన విషయం తెలసుకుని తన న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటూ..
మధురై తూత్తుకుడిలో (Madurai Thoothukudi ) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన దంపతులు.. ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త వ్యవసాయ కూలి పనులు (Agricultural labor) చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. వీరి ఆదాయం అంతంతమాత్రమే కావడంతో పిల్లల పోషణ భారంగా మారింది. దీంతో ఇద్దరి పిల్లలు చాలు అనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో 2013లో తూత్తుకుడి ప్రభుత్వ వైద్యశాలలో (Government Hospital) ఆపరేషన్ చేయించుకుంది. అయితే 2014లో ఆమె మళ్లీ గర్భం (pregnancy) దాల్చింది. 2015లో ఆమె మూడో బిడ్డకు జన్మనిచ్చింది.
ఆపరేషన్ చేయించుకున్నా ఎలా గర్భం దాల్చానంటూ ఆమెకు అనుమానం కలిగించింది. చివరకు విచారించగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని తెలిసింది. దీంతో తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ బాధితురాలు 2016లో కోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘంగా విచారించిన మధురై కోర్టు శుక్రవారం సంచలన తీర్చు ఇచ్చింది. బాధితురాలి మూడో బిడ్డ చదువు, పుస్తకాలు.. ఇలా ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది. పిల్లల పోషణ నిమిత్తం వారి కుటుంబానికి ఏడాదికి రూ.1.20లక్షలు లేదా మూడో కుమారుడికి డిగ్రీ వయసు వచ్చే వరకూ నెలకు రూ.10,000 అందించాలని తీర్పు ఇచ్చింది.
Updated Date - 2023-05-02T16:32:39+05:30 IST