India-Pakistan: ఈ మహిళ సంగతి సరే కానీ.. 8 ఏళ్ల క్రితం భారత్‌లోకి అక్రమంగా వచ్చిన పాకిస్తానీ మహిళను ఏం చేశారంటే..!
ABN, First Publish Date - 2023-07-19T16:16:40+05:30
యువకుడితో ప్రేమలో పడి, నలుగురు పిల్లలతో కలిసి జూలై 4న భారత్‌లోకి ప్రవేశించింది. ఈమెను యూపీ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రియుడిని కలిసే ముందు ఢిల్లీలో ఉన్న మరికొంతమందిని కలవడంతో ఈమె వ్యవహారంపై నిఘా వర్గాలు దృష్టిసారించాయి. ఈ విషయం పక్కన పెడితే..
ప్రియుడిని కలిసేందుకు పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన సీమా హైదర్ అనే మహిళ.. పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. సదరు మహిళ పబ్జీ ఆడుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడితో ప్రేమలో పడి, నలుగురు పిల్లలతో కలిసి జూలై 4న భారత్‌లోకి ప్రవేశించింది. ఈమెను యూపీ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రియుడిని కలిసే ముందు ఢిల్లీలో ఉన్న మరికొంతమందిని కలవడంతో ఈమె వ్యవహారంపై నిఘా వర్గాలు దృష్టిసారించాయి. ఈ విషయం పక్కన పెడితే.. 8 ఏళ్ల క్రితం ఓ మహిళ ఇలాగే భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించింది. పోలీసులు ప్రశ్నించగా.. సల్మాన్, షారూఖ్‌లను చూడాలని చెప్పింది. తర్వాత ఏం జరిగిందంటే..
పాకిస్థాన్ (Pakistan) కరాచీ ప్రాంతానికిచ చెందిన 27 ఏళ్ల చందా ఖాన్ అనే అనే యువతి (young woman) .. బాలీవుడ్ హీరోలైన సల్మాన్, షారూక్ (Salman and Shah Rukh Khan) సినిమాలు ఎక్కువగా చూస్తూ వారిపై అభిమానం పెంచుకుంది. ఎలాగైనా వారిని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేది. కానీ భారత్ వచ్చే ధైర్యం చేయలేదు. అయితే చివరకు ఎలాగోలా వెళ్లి వారిని కలవాలని నిర్ణయించుకుంది. 2015 జూలై 30న పాకిస్థాన్‌లోని వాఘా రైల్వే స్టేషన్‌లో (Wagah Railway Station) సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో భారత్‌లోకి ప్రవేశించింది. పాస్‌పోర్ట్, వీసా లేకుండా కేవలం చేతిలో కొన్ని మందులు, కొంత పాకిస్థాన్ కరెన్సీ పట్టుకుని వచ్చేసింది.
అట్టారీలో ప్రయాణికులంతా కస్టమ్స్, ఇమిగ్రేషన్ క్లియరెన్స్ చేయించుకుని ఢిల్లీ (Delhi) వైపు వెళ్తున్న సమయంలో సదరు మహిళ.. పోలీసుల కళ్లుగప్పి వారితో పాటూ వచ్చేసింది. అయితే రాత్రి 10గంటల ప్రాంతంలో జలంధర్ రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకునే సమయంలో ఆర్‌పీఎఫ్ (Railway Protection Force) సిబ్బంది అనుమానం వచ్చి ఆమెను ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను జలంధర్ స్టేషన్‌లో ఆపి మహిళను జైలుకు తరలించారు. ‘‘సల్మాన్, షారూక్‌తో పాటూ కొన్ని మసీదులను చూసేందుకు వచ్చా’’.. అని విచారణలో చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. అనంతరం ఆమెకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తి చేసుకున్న ఆమెను 2018లో తిరిగి పాకిస్థాన్‍కు పంపించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - 2023-07-19T16:16:40+05:30 IST