ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Biryani: బిర్యానీ తిని చనిపోయిన యువతి.. ఎలా జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-01-07T17:45:48+05:30

గడిచిన 2022కు వీడ్కోలు... కొత్త సంవత్సరం 2023కు ఆహ్వానం పలికే సందర్భంలో అందరిలానే ఓ యువతి ఆనందంగా గడిపింది. డిసెంబర్ 31న తనకు ఇష్టమైన బిర్యానీని (Biryani) ఆన్‌లైన్‌ ఆర్డర్ (Online order) ద్వారా తెప్పించుకుని తిన్నది. కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కసరగడ్: గడిచిన 2022కు వీడ్కోలు... కొత్త సంవత్సరం 2023కు ఆహ్వానం పలికే సందర్భంలో అందరిలానే ఓ యువతి ఆనందంగా గడిపింది. డిసెంబర్ 31న తనకు ఇష్టమైన బిర్యానీని (Biryani) ఆన్‌లైన్‌ ఆర్డర్ (Online order) ద్వారా తెప్పించుకుని తిన్నది. దురదృష్టవశాత్తూ ఆ బిర్యానీయే యువతి ప్రాణాలను హరించిన విషాదకర ఘటన కేరళలో (Kerala) వెలుగుచూసింది.

కసరగడ్‌కు (Kasaragod) సమీపంలోని పెరుంబలాకు చెందిన 20 ఏళ్ల యువతి అంజు శ్రీపార్వతి (Anju Sreeparvathi) డిసెంబర్ 31న రొమన్సియా అనే రెస్టారెంట్‌ నుంచి కేరళలో లభ్యమయ్యే ‘కొజిమంతి’ (Kuzhimanthi) అనే బిర్యానీని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. డెలివరీ వచ్చాక ఇష్టంగా ఆరగించింది. అయితే బిర్యానీ తిన్న తర్వాత అస్వస్థకు (food poisonin) గురై ఆస్పత్రి పాలైంది. డిసెంబర్ 31 నుంచి చికిత్స పొందుతూ శనివారం ఉదయం (జనవరి 7న) చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. అంజు శ్రీపార్వతి మృతికి బిర్యానీయే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని పోలీసు పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫిర్యాదు నమోదు చేశామని, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. కాగా కలుషిత ఆహారానికి గురైన యువతి అంజుకి తొలుత ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో కర్ణాటక మంగళూరులోని మరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స ఆమె కన్నుమూసిందని కుటుంబ సభ్యులు చెప్పారు.

ఈ ఘటనపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి స్పందించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. రిపోర్ట్ అందించాలంటూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. యువతికి అందించిన ట్రీట్‌మెంట్ సహా అన్నింటినీ డీఎంవో పరిశీలించనున్నారని వివరించారు. ఎఫ్‌ఎస్ఎస్ఏ( Food Safety and Standards Act ) నిబంధనల ప్రకారం ఆహార కలుషితం వెలుగుచూసిన హోటల్స్ లైసెన్స్ రద్దవుతుందని ఆమె తెలిపారు. కాగా కేరళలో వరుసగా వెలుగుచూస్తున్న కలుషిత ఆహారం కేసులు అక్కడ ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ వారం ఆరంభంలో కలుషిత ఆహారానికి కొట్టాయం మెడికల్ కాలేజీలో పనిచేసే ఓ నర్సు మృత్యువాతపడింది. కోజికోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఆహారం తిన్నడం ఆమె ప్రాణాలు తీసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Updated Date - 2023-01-07T17:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising