Viral Video: ఇదెక్కడి పెళ్లి విందురా బాబు.. వరద నీటిలో విందు ఆరగించిన మహిళలు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!
ABN, First Publish Date - 2023-08-18T11:20:39+05:30
పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా అతి ముఖ్యమైన కార్యక్రమం. వధూవరుల కుటుంబాలు తమ బడ్జెట్‌కు అనుగుణంగా వివాహ వేడుక కోసం ఏర్పాట్లు చేస్తారు. బంధువులు, స్నేహితులను వివాహ వేడుకకు ఆహ్వానించి తమకు వీలైనంతలో వేడుక నిర్వహిస్తారు. అతిథులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు.
పెళ్లి (Marriage) అనేది ఎవరి జీవితంలోనైనా అతి ముఖ్యమైన కార్యక్రమం. వధూవరుల కుటుంబాలు తమ బడ్జెట్‌కు అనుగుణంగా వివాహ వేడుక కోసం ఏర్పాట్లు చేస్తారు. బంధువులు, స్నేహితులను వివాహ వేడుకకు ఆహ్వానించి తమకు వీలైనంతలో వేడుక నిర్వహిస్తారు. అతిథులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు. అయితే అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత భారీ వర్షం (Heavy Rain), వరద (Flood) కారణంగా మొత్తం మునిగిపోతే ఏం జరుగుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో అలాంటి అనుభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొందరు మహిళలు నడము లోతు నీటిలో ధైర్యంగా నడుచుకుంటూ పెళ్లి విందుకు హాజరయ్యారు (wedding feast in flood water). మహిళలు డైనింగ్ స్పేస్‌లోకి వెళ్లి తమ ప్లేట్లలో ఆహారాన్ని స్వయంగా వడ్డించుకున్నారు. తర్వాత అందరూ కలిసి కుర్చీలో కూర్చుని విందును ఆరగించి తిరిగి వెళ్లిపోయారు. ఈ వీడియో చూస్తుంటే పెళ్లి ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత భారీ వర్షం, వరద కారణంగా సమస్య తలెత్తినట్టు అర్థమవుతోంది.
Shocking: ఒక్క చెంపదెబ్బతో ప్రాణం పోయింది.. ముంబై రైల్వే స్టేషన్లో దారుణం.. అసలేం జరిగిందంటే..
memesone_2 అనే ఇన్స్టాగ్రమా హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించారు. లక్ష మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.
Updated Date - 2023-08-18T11:20:39+05:30 IST