కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పెళ్లిలో వధూవరుల ముందే టెంకాయతో తల బాదుకున్న యువకుడు.. చివరికి ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Dec 19 , 2023 | 06:12 PM

పెళ్లిళ్లలో కొందరు అతిథులు చిత్రవిచిత్ర ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు ఏవేవో విన్యాసాలు చేసి.. అంతా అవాక్కవయ్యేలా చేస్తుంటారు. ఇంకొందరు ఎవరికీ సాధ్యం కాని పనులు చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. తాజాగా...

Viral Video: పెళ్లిలో వధూవరుల ముందే టెంకాయతో తల బాదుకున్న యువకుడు.. చివరికి ఏం జరిగిందో చూడండి..

పెళ్లిళ్లలో కొందరు అతిథులు చిత్రవిచిత్ర ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు ఏవేవో విన్యాసాలు చేసి.. అంతా అవాక్కవయ్యేలా చేస్తుంటారు. ఇంకొందరు ఎవరికీ సాధ్యం కాని పనులు చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. తాజాగా, ఓ వివాహంలో యువకుడు చేసిన స్టంట్ వీడియో తెగ వైరల్ అవుతోంది. సదరు యువకుడు వధూవరుల ముందే పచ్చి టెంకాయను తలకేసి కొట్టుకున్నాడు. చివరికి ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పెళ్లి వేడుకలో ఓ వ్యక్తి చేసిన విన్యాసం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధర్మేంద్ర రాజ్‌భర్ అనే యువకుడు ఓ వివాహాంలో వినూత్న విన్యాసం చేశాడు. పెళ్లి వేదికపై ఉన్న వధూవరుల వద్దకు వెళ్లాడు. తర్వాత ఉన్నట్టుండి ఓ పచ్చి టెంకాయను తీసుకుని విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. ‘‘పచ్చి టెంకాయతో ఏం చేస్తున్నాడబ్బా’’.. అని అంతా ఆలోచిస్తుండగా.. ఒక్కసారిగా అతను (young man broke a coconut with his head) టెంకాయతో తలకేసి బాదుకున్నాడు. దీంతో అక్కడున్న వధూవరులతో పాటూ అతిథులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా చాలా సార్ల తలకు కొట్టుకున్న తర్వాత అందులో నుంచి నీళ్లు బయటికి వచ్చాయి.

Viral Video: మీకు టామాటా సాస్ అంటే ఎంతో ఇష్టమా.. అయితే ఈ వీడియో చూస్తే.. మీ అభిరుచిని వెంటనే మార్చుకుంటారు..

కొబ్బరి నీళ్లను రెండు గ్లాసుల్లో నింపి వధూవరులకు అందిస్తాడు. అతని టాలెంట్ చూసి షాకైన వధూవరులు.. టెంకాయ నీళ్లను తాగి కూల్ అవుతారు. తర్వాత వరుడి పక్కన ఉన్న మరో పచ్చి టెంకాయను తీసుకుని.. మళ్లీ అదేవిధంగా తలకేసి కొట్టుకుని ఆ నీటిని తానే తాగేస్తాడు. అసలు విషయానికొస్తే.. తక్కువ సమయంలో ఎక్కువ టెంకాయలు పగులగొట్టడంలో ఈ ధర్మేంద్ర నిష్ణాతుడని తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర.. ఇటీవల 1.25 నిముషాల్లో 211 కొబ్బరికాయలను చేత్తో పగులగొట్టాడు. అలాగే ఒక నిముషంలో 251 కొబ్బరికాయలను పగులగొట్టి ఆ రికార్డును బద్ధలుకొట్టాడు. ఫంక్షన్లకు వెళ్లిన సందర్భాల్లో అందరి ముందూ ఇలా పచ్చి టెంకాయలను తలకు కొట్టుకుని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడట. మొత్తానికి ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సదరు యువకుడిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: రోడ్డు మధ్యలో ఉన్నట్టుండి కారు ఆపిన భర్త.. కొడుకుతో పాటూ భార్యను కింద లాగి మరీ.. అతడు చేసిన నిర్వాకం...

Updated Date - Dec 19 , 2023 | 06:12 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising