కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime: అసలు వీడు మనిషేనా.. కాబోయే భార్య అన్న ఒకే ఒక్క మాటకు.. ఇంత పని చేస్తాడునుకోలేదు..

ABN, First Publish Date - 2023-08-13T21:36:54+05:30

అదేంటో తెలీదు కానీ.. కొందరు మగాళ్లు తమకు ఆడవాళ్లపై సర్వహక్కులు ఉంటాయని భావిస్తుంటారు. ఇక ప్రేమించిన వారి పట్ల మరీ వికృతంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి చివరికి నమ్మి వచ్చిన వారిని దారుణంగా మోసం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు...

Crime: అసలు వీడు మనిషేనా.. కాబోయే భార్య అన్న ఒకే ఒక్క మాటకు.. ఇంత పని చేస్తాడునుకోలేదు..
ప్రతీకాత్మక చిత్రం

అదేంటో తెలీదు కానీ.. కొందరు మగాళ్లు తమకు ఆడవాళ్లపై సర్వహక్కులు ఉంటాయని భావిస్తుంటారు. ఇక ప్రేమించిన వారి పట్ల మరీ వికృతంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి చివరికి నమ్మి వచ్చిన వారిని దారుణంగా మోసం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, రాజస్థాన్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కాబోయే భార్య వద్దకు వెళ్లిన వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో.. చివరకు అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే..

రాజస్థాన్ (Rajasthan) జైపూర్ జోత్వారా ప్రాంతానికి చెందిన యువకుడికి.. ముహానా ప్రాంతానికి చెందిన 19ఏళ్ల యువతితో 2022 డిసెంబర్‌లో నిశ్చితార్థం (Engagement) జరిగింది. త్వరలో మంచి ముహూర్థం చూసుకుని వివాహం (marriage) జరిపించాలని అనుకున్నారు. ఇదిలావుండగా, నిశ్చితార్థం జరిగిన కొన్నాళ్లకు యువకుడు.. కాబోయే భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవాడు. కాబోయే భర్తే కావడంతో ఆమె కూడా నిత్యం అతడితో మాట్లాడుతూ ఉండేది. అయితే ఇటీవల ఓ రోజు ఎవరూ లేని సమయంలో నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు. కాసేపు మాట్లాడిన తర్వాత ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Viral Video: ఇతడి తెలివితేటలు అమోఘం.. కరెంట్ లేకుండానే పొలానికి నీళ్లు ఎలా వదులుతున్నాడో చూడండి..

తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఇలాంటిన్నీ పెళ్లి తర్వాతే.. అంటూ యువతి అంగీకరించలేదు. దీంతో యువకుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ‘‘నా మాట వినకపోతే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటా’’.. అని బెదిరించాడు. అయినా యువతి మాత్రం అతడి మాటలు వినిపించుకోలేదు. చివరకు ఆమెపై దాడి (Assault on young woman) చేయడమే కాకుండా.. తన స్నేహితులను పిలిపించి యువతి కుటుంబంపై దాడి చేయించాడు. దీంతో చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యువకుడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: బాత్రూంలోకి వెళ్లిన మహిళ.. అనుమానం వచ్చి తొంగిచూడగా షాకింగ్ సీన్.. చివరకు ఆమె చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - 2023-08-13T21:36:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising