ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Railway: రైలు ఎక్కి సీట్లో కూర్చున్న మరుక్షణమే ఉలిక్కిపడ్డ కుర్రాడు.. దిగ్గున లేచి సీట్లో ఏముందో చూసి షాక్.. చివరకు..!

ABN, First Publish Date - 2023-05-05T18:51:43+05:30

ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాల్లో భారతీయ రైల్వే ఒకటి. నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే రైలు ప్రయాణ సమయాల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాల్లో భారతీయ రైల్వే (Indian Railways) ఒకటి. నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే రైలు ప్రయాణ సమయాల్లో ప్రయాణికులు కొన్నిసార్లు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువగా బోగీలో అపరిశుభ్రత వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. కొందరు ఇలాంటి సమస్యలపై నేరుగా రైల్వే అధికారులకే ఫిర్యాదు చేస్తుంటారు. ఇందుకు సబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఓ కుర్రాడికి రైలు ప్రయాణంలో షాకింగ్ అనుభవం ఎదురైంది. సీట్లో కూర్చున్న మరుక్షణమే.. అక్కడ ఏముందో చూసి ఉలిక్కిపడ్డాడు.

సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు (Viral news) కొడుతోంది. ముఖ్తార్ అలీ అనే యువకుడికి రైలు ప్రయాణంలో (train journey) వింత అనుభవం ఎదురైంది. రైలు బోగీలో తన సీటు వద్దకు వెళ్లిన అతను.. తీరా కూర్చోగానే ఉన్నట్టుండి షాక్ అయ్యాడు. ఏదో గుచ్చుకున్నట్లు అనిపించగానే.. వెంటనే పైకి లేచి చూసుకున్నాడు. సీటుకు సీటకు మధ్యలో ఉన్న ఖాలీ స్థలంలో నుంచి ఓ ఇనుప రాడ్డు (iron rod) పొడుచుకుని పైకి రావడాన్ని చూసి ఖంగుతిన్నాడు. అది గుచ్చుకోవడం వల్ల స్వల్ప గాయాలవడంతో అతడికి చిర్రెత్తుకొచ్చింది. సేఫ్టీ కోసమని రైలు ఎక్కితే ఏంటిది.. అనుకుంటూ నేరుగా అధికారులకే ఫిర్యాదు చేశాడు.

Viral Video: నువ్వు కదయ్యా.. అసలు సిసలు తండ్రివంటే.. కూతురి సంతోషం కోసం అమ్మాయిలాగా వేషం వేసుకుని మరీ..!

ట్రైన్, తన సీటు నంబర్‌ను ప్రస్తావిస్తూ.. ‘‘ఇనుప రాడ్డు వల్ల నాకు హాని కలిగింది.. ఇలాంటి వాటి వల్ల చాలా ప్రమాదం.. దయచేసి ఇలా జరక్కుండా చూడండి’’.. అని పేర్కొంటూ రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై రైల్వే సర్వీస్ అధికారిక ట్విట్టర్ (Railway Service Official Twitter) ఖాతా నుంచి రిప్లై వచ్చింది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాధితుడి PNR/UTS, మొబైల్ నంబర్ తెలియజేయాలని అధికారులు సూచించారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు.. రైలు ప్రయాణ సమయాల్లో తమకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఇలాంటి సందర్భాల్లో టికెట్ చార్జీలను వాపస్ ఇవ్వాలి’’.. అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Shocking News: పచ్చి చేపలోని ఆ భాగాన్ని తింటే డయాబెటిస్ తగ్గుతుందట.. అలా తిన్న ఓ మహిళ ఇప్పుడెలాంటి పరిస్థితుల్లో ఉందంటే..

Updated Date - 2023-05-05T20:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising