అత్తతో చనువుగా ఉంటూ వచ్చిన యువకుడు.. మామ విషయంలో రహస్యంగా ఆమె చెప్పింది విని.. చివరకు..

ABN, First Publish Date - 2023-01-08T19:22:19+05:30

ఆనందంగా సాగుతున్న సంసారాల్లో కొన్నిసార్లు అనుకోకుండా డబ్బు రూపంలోనో, ఆరోగ్య విషయంలోనో, వివాహేతర సంబంధాల విషయంలోనే.. లేనిపోని సమస్యలు వచ్చి పడుతుంటాయి. దీనివల్ల ఒక్కోసారి దంపతులు విడిపోవడమో.. లేక ..

అత్తతో చనువుగా ఉంటూ వచ్చిన యువకుడు.. మామ విషయంలో రహస్యంగా ఆమె చెప్పింది విని.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆనందంగా సాగుతున్న సంసారాల్లో కొన్నిసార్లు అనుకోకుండా డబ్బు రూపంలోనో, ఆరోగ్య విషయంలోనో, వివాహేతర సంబంధాల విషయంలోనే.. లేనిపోని సమస్యలు వచ్చి పడుతుంటాయి. దీనివల్ల ఒక్కోసారి దంపతులు విడిపోవడమో.. లేక చనిపోవడమో, చంపబడడమో జరుగుతుంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు తన అత్తతో చనువుగా ఉండేవాడు. ఓ రోజు మామ విషయంలో అత్త రహస్యంగా చెప్పిన మాట విన్న యువకుడు.. చివరకు దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

Viral Video: ఆలయంలో వ్యక్తి చేసిన నిర్వాకం.. మహిళను ఈడ్చుకెళ్లి మరీ.. కారణం ఏంటని అడిగితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఫిరోజాబాద్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన నయీమ్.. భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. భార్య అంటే నయీమ్‌కు ఎంతో అభిమానం. ఆమెకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేవాడు. ఇలాంటి ఆనందకర సమయంలో వారి కటుంబంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. ఈ దంపతులకు సమీప బంధువైన షారుక్ అనే వ్యక్తి.. ఇటీవల తరచూ వీరి ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. షారుక్‌కు నయీమ్ భార్య వరుసకు అత్త అవుతుంది. కాగా, ఇటీవల నయీమ్ లేని సమయంలో వీరి ఇంటికి ఎక్కువగా వస్తూ ఉండేవాడు.

Viral Video: ఇతడి తెలివిని చూసి ఆనంద్ మహీంద్రాయే అవాక్కయ్యారు.. రూపాయి ఖర్చు లేకుండా..

police.jpg

ఈ క్రమంలో షారుక్.. తన అత్తతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ఆమె కూడా షారుక్ పట్ల ప్రేమగా ఉండేది. కొన్నాళ్లకు వీరి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. అప్పటి నుంచి నయీమ్ లేని సమయంలో రాత్రిళ్లు కూడా వచ్చి వెళ్తూ ఉండేవాడు. రోజూ కలవాలంటే నయీమ్ అడ్డుగా ఉండడం వీరికి నచ్చలేదు. భర్త అడ్డు తొలగిపోతే ఇద్దరం వివాహం చేసుకుని, ఆనందంగా ఉండొచ్చని నయీమ్ భార్య.. షారుక్‌తో చెప్పింది. చివరకు ఇద్దరూ కలిసి నయీమ్‌ను చంపేయాలని (Conspiracy) నిర్ణయించుకున్నారు.

Viral Video: నూడుల్స్ తిందామని స్పూన్‌తో పైకి ఎత్తగానే.. ఒక్కసారిగా ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

జనవరి 1న నయీమ్‌పై షారుక్ దాడి చేశాడు. తల నుజ్జు నుజ్జుగా చేసి, మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలుసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న షారుఖ్‌పై పోలీసులు రూ.10వేలు రివార్డు (Ten thousand rupees reward) కూడా ప్రకటించారు. చివరకు షికోహాబాద్‌లోని ఓ ఇంట్లో దాక్కున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

హనీమూన్‌లో అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త.. భార్య ఏం చేస్తోందో చూద్దామని వెతగ్గా.. ఎదురుగా..

Updated Date - 2023-01-08T19:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising