ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతి బంధువునంటూ అంబులెన్స్ ఎక్కాడు.. ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉండగా.. ఆమెకు సేవలు చేస్తూనే..

ABN, First Publish Date - 2023-02-07T19:39:53+05:30

మహిళలను తమ దారికి తెచ్చుకునే క్రమంలో చాలా మంది యువకులు.. ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. కొందరు మాయమాటలు చెప్పి మోసం చేస్తుంటే.. మరికొందరు బలాత్కారానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళలను తమ దారికి తెచ్చుకునే క్రమంలో చాలా మంది యువకులు.. ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. కొందరు మాయమాటలు చెప్పి మోసం చేస్తుంటే.. మరికొందరు బలాత్కారానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. కేరళలో ఓ యువతి విషయంలో దారుణం జరిగింది. యువతి బంధవునంటూ ఓ వ్యక్తి అంబులెన్స్ ఎక్కాడు. ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉండగా.. సేవలు చేస్తున్నట్లు నటిస్తూ చివరకు దారుణానికి పాల్పడ్డాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

కేరళలోని (Kerala) త్రిసూర్ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాపమంగళానికి చెందిన ఓ యువతి (woman) గత శుక్రవారం విషం (poison) తాగింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం కొడంగల్లూర్ ఆస్పత్రికి తరలించారు. ఇదే ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్‌గా (Electrician) పని చేస్తున్న దయాలాల్ అనే యువకుడు.. మహిళపై కన్నేశాడు. ఆమె తన బంధువు అని అందరినీ నమ్మించాడు. తర్వాత సదరు యువతిని మెరుగైన చికిత్స కోసం త్రిసూర్ మెడికల్ కళాశాల (Thrissur Medical College) ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో అంబులెన్స్‌లో (Ambulance) ఆమె వెంట దయాలాల్ కూడా వెళ్లాడు.

ఓ మహిళకు విపరీతంగా కడుపునొప్పి.. ఆపరేషన్ చేస్తూ పొట్టలో ఏముందో చూసి నోరెళ్లబెట్టిన డాక్టర్.. భర్తను పిలిచి మరీ..

త్రిసూర్ ఆస్పత్రిలో చేర్చిన తర్వాత.. ఆమె వద్దే ఉంటూ సపర్యలు చేస్తున్నట్లు నటించాడు. తర్వాత రోజు ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో (unconsciousness) ఉన్న యువతిపై నిందితుడు అత్యాచారానికి (sexual assault) పాల్పడ్డాడు. తర్వాత జరిగిన విషయం గురించి తెలుసుకున్న బాధితురాలు ఆస్పత్రి సిబ్బందికి తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారించారు. నిందితుడు దయాలాల్‌ను అదుపులోకి తీసుకుని, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: ఇదేం పిచ్చిరా బాబూ.. శోభనం వీడియోను నెట్టింట పోస్ట్ చేసిన నవ దంపతులు.. మండిపడుతున్న నెటిజన్లు..!

Updated Date - 2023-02-07T19:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising