ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఓ యువకుడి అద్భుత స్టంట్.. అతడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటే..

ABN, First Publish Date - 2023-07-12T20:23:05+05:30

కొంత మంది యువకులకు అద్భుతమైన ట్యాలెంట్ ఉంటుంది. సినిమాల్లో చూపించే విధంగా కళ్లు చెదిరే రీతిలో స్టంట్లు చేయగలుగుతారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి వ్యక్తుల ప్రతిభ చాలా మందిని చేరుతోంది. వారు మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొంత మంది యువకులకు అద్భుతమైన ట్యాలెంట్ ఉంటుంది. సినిమాల్లో చూపించే విధంగా కళ్లు చెదిరే రీతిలో స్టంట్లు చేయగలుగుతారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి వ్యక్తుల ప్రతిభ చాలా మందిని చేరుతోంది. వారు మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో (Viral Video)లో ఓ కుర్రాడు రైల్వే ప్లాట్‌ఫామ్‌పై (Railway Station) అద్భుతమైన స్టంట్ (Stunt) చేసి అందరినీ అలరించాడు. అతడి ట్యాలెంట్‌కు చాలా మంది ఫిదా అయ్యారు.

RPF INDIA ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. బీహార్‌ (Bihar)లోని మన్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో రైలు ఆగింది. ఆ సమయంలో ఓ యువకుడు ప్లాట్‌ఫామ్‌పై గాల్లోకి ఎగురుతూ అద్భుతంగా ఫ్లిప్స్ చేశాడు. అతడి స్టంట్స్‌ను స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియో ఆర్పీఎఫ్ (RPF) సిబ్బంది వరకు చేరడంతో వారు స్పందించారు. ఆ వీడియో ఆధారంగా యువకుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు కేసు నమోదు చేశారు. ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు.

Viral News: బాబోయ్.. ఇంత డబ్బు ఏం చేసుకోవాలి..? రూ.14 వేల విమాన టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే.. రీఫండ్ ఎంతొచ్చిందో చూస్తే..!

ఆర్పీఎఫ్ సిబ్బంది చర్యల పట్ల నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆర్పీఎఫ్ సిబ్బంది చర్యలను ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆర్పీఎఫ్ సిబ్బంది చాలా కఠినంగా ప్రవర్తించారని అభిప్రాయపడ్డారు. కాగా, ఆ కుర్రాడి స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు 2 లక్షల మంది ఆ వీడియోను చూశారు.

Updated Date - 2023-07-12T20:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising