ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: లిఫ్ట్‌లో ఒంటరిగా ఉందని చొరవ తీసుకున్న యువకుడు.. మొదటిసారి క్షమించిన యువతి.. చివరికి రెండోసారి..

ABN, First Publish Date - 2023-10-01T21:41:54+05:30

మహిళలు ఒంటరి కనిపిస్తే చాలు.. అప్పటిదాకా మంచిగా ఉన్న వారు కాస్త.. మానవ మృగాళ్లలా మారిపోతుంటారు. ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చివరికి దారుణాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది యువతులు ...

మహిళలు ఒంటరి కనిపిస్తే చాలు.. అప్పటిదాకా మంచిగా ఉన్న వారు కాస్త.. మానవ మృగాళ్లలా మారిపోతుంటారు. ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చివరికి దారుణాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది యువతులు ఇటు బయట ఎవరికీ చెప్పుకోలేక.. అటూ ఇంట్లోనూ చెప్పలేక లోలోపలే కుమిలిపోతుంటారు. అయితే కొందరు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తుంటారు. మరికొందరు ఎదురుదాడి చేసి మరీ.. శాడిస్టులకు చుక్కలు చూపిస్తుంటారు. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) పెద్ద అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ రూంలోకి (Lift room) వెళ్తుంది. తాను వెళ్లాల్సిన ఫ్లోర్ నంబర్ క్లిక్ చేసి, అంత వరకూ టైమ్ పాస్ అయ్యేందుకు ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అయితే మధ్యలో ఓ యువకుడు కూడా లిఫ్ట్‌లోకి వస్తాడు. లోపలికి వచ్చిన అతను యువతి ఒంటరిగా ఉండడాన్ని గమనించి తనలోని వక్రబుద్ధిని బయటపెడతాడు. ఒక్కటే ఉంది.. ఏం చేస్తుందిలే.. అని అనుకుని మెల్లగా (young man misbehaves with young woman) దగ్గరికి వెళ్లి తాకాలని చూస్తాడు. దీంతో షాక్ అయిన యువతి భయంతో వెంటనే ఇటు వైపు వచ్చి నిలబడుతుంది. అప్పటికైనా తన తప్పు తెలుసుకోవాల్సిన యువకుడు.. అందుకు విరుద్ధంగా మళ్లీ ఆమె వద్దకు వెళ్తాడు.

Viral Video: సినిమా తరహా షాట్స్ కోసం రైలు పట్టాల మీదకు వెళ్లిన యువకుడు.. తీరా ఫోన్‌లో రికార్డ్ చేస్తుండగా..

ఈసారి ఎలాగైనా ఆమెను వదలకూడదు.. అని అనుకుని మెల్లగా వెళ్లి మీద చెయ్యి వేస్తాడు. దీంతో యువతికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘పోనీలే అని వదిలేస్తే.. మళ్లీ తప్పుగా ప్రవర్తిస్తావా’’.. అని అనుకుంటూ చేత్తో గట్టిగా ఒకటి ఇస్తుంది. దెబ్బకు అతను వెళ్లి దూరంగా పడతాడు. వెంటనే యువతి కాలితో అతన్ని.. తన్నరాని చోట బలంగా తన్నుతుంది. వెనువెంటనే తన మొఖంపై మరింత గట్టిగా తన్నుతుంది. దీంతో కుయ్యో.. మొర్రో.. అనుకుంటూ కిందపడిపోతాడు. తన ఫ్లోర్ రాగానే యువతి వెళ్లిపోతుంది. కాగా, ఈ ఘటన మొత్తం లిఫ్ట్ రూంలో ఉన్న సీసీ కెమెరాలో (CC camera) రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వీడికి ఇలా కావాల్సిందే’’.. అని కొందరు, ‘‘అందరు యువతులు ఇలాగే ఉండాలి’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అమెరికా స్కూళ్లలో ఇలా కూడా జరుగుతుందా.. క్లాసు రూంలో ఏమాత్రం భయం లేకుండా.. ఈ అమ్మాయి చేసిన పని చూడండి..

Updated Date - 2023-10-01T21:46:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising