ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: పొరపాటున నాలుకను కొరుక్కున్న 27 ఏళ్ల యువతి.. మరుక్షణమే ఊపిరాడక పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తీసుకెళ్తే..!

ABN, First Publish Date - 2023-09-14T15:26:49+05:30

ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి , ఏదో ఒక సమయంలో నాలుక కొరుక్కోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో కొన్ని క్షణాల పాటు భరించలేని నొప్పి పడుతుంది. అయితే తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. సాధారణంగా వైద్యుల వద్దకు వెళ్లే పరిస్థితి రాదు. అయితే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి , ఏదో ఒక సమయంలో నాలుక కొరుక్కోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో కొన్ని క్షణాల పాటు భరించలేని నొప్పి పడుతుంది. అయితే తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. సాధారణంగా వైద్యుల వద్దకు వెళ్లే పరిస్థితి రాదు. అయితే కొన్నిసార్లు బలంగా కొరుక్కుంటే మాత్రం చివరకు కొన్ని మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుందే తప్ప.. ప్రాణాలకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. పొరపాటున నాలుకను కొరుక్కున్న 27 ఏళ్ల యువతి పరిస్థితి విషమంగా మారింది. ఊపిరాడక ఇబ్బంది పడుతుండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చివరకు ఏం తేల్చారంటే..

ఆస్ట్రేలియా (Australia) గోల్డ్ కోస్ట్‌కు చెందిన కైట్లిన్ అల్సోప్ అనే మహిళకు ఊహించని సమస్య వచ్చి పడింది. ఇటీవల ఓ రోజు ఆమె తన స్నేహితుడితో కలిసి డిన్నర్‌కు వెళ్లింది. రాత్రి సమయంలో భోజనం చేస్తుండగా మధ్యలో పొరపాటున నాలుక కొరుక్కుంది. అందరికీ అప్పుడప్పుడూ ఇలా జరగడం సహజమే కాబట్టి.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ యువతి కూడా ముందు పట్టించుకోలేదు. అయితే రక్తస్రావం ఎక్కువవడంతో పాటూ కొద్ది సేపటికి ఆమెకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. మరికాసేపటికి ఆమెకు మాట్లాడటం కూడా కష్టమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Viral Video: పార్సిల్ తీసుకొచ్చి ఇంటి తలుపు ముందు పెట్టిన డెలివరీ బాయ్.. వెళ్తూ వెళ్తూ ఎంత పని చేశాడో చూడండి..

వైద్యులు కూడా మొదట ఇది సాధారణ సమస్యే అని అనుకున్నారు. అయితే పూర్తి పరీక్షలు చేసిన అనంతరం వారికి అసలు సమస్య తెలిసింది. ఆమె అనాఫిలాక్సిస్ అనే అలెర్జీతో బాధపడుతున్నట్లు తెలిపారు. దీనికి మందులు వాడినా యువతికి సమస్య తగ్గకపోగా మరింత ఎక్కువైంది. చర్మం ఎరుపు, నీలం రంగులోకి మారింది. అలాగే ఆమె నాలుక కూడా నల్లగా మారిపోయింది. దీంతో వైద్యులు పూర్తి స్థాయిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చివరకు సదరు యువతి అస్లోప్ లుడ్విగ్స్ ఆంజినా అనే అరుదైన ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. జ్ఞాన దంతాల కారణంగా ఈ ఇన్ఫెక్షన్ నోటిలో వ్యాపించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను కోమాలో ఉంచాల్సి వచ్చిందన్నారు. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: టెక్నాలజీని వాడుకోవడం అంటే ఇదేనేమో.. ఇకపై రైల్వే రైల్వే స్టేషన్లలో అంతా ఇలాగే చేస్తారేమో..

Updated Date - 2023-09-14T15:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising