Viral Video: చెత్త డబ్బాలో కూర్చుని షాకిద్దామనుకుంటే.. ఈ యువతికి ఇలా జరిగిందేంటి..? కాసేపటికే వ్యాన్ ఎంట్రీ.. చివరకు..!
ABN, First Publish Date - 2023-06-24T16:04:37+05:30
నేటితరం యువతీయువకులు రీల్స్‌లో ఫేమస్ అయ్యేందుకు ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. కొందరు తెలిసి కూడా ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు ఫన్నీ, ప్రాంక్ వీడియోలు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్నిసార్లు వైరల్ మాట దేవుడెరుగు..
నేటితరం యువతీయువకులు రీల్స్‌లో ఫేమస్ అయ్యేందుకు ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. కొందరు తెలిసి కూడా ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు ఫన్నీ, ప్రాంక్ వీడియోలు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్నిసార్లు వైరల్ మాట దేవుడెరుగు.. ప్రాణాలు దక్కాయి చాలు.. అన్న పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చెత్త డబ్బాలో కూర్చుని అందరికీ షాకిద్దామనుకుంది. కాసేపటికి చెత్త వ్యాన్ రావడంతో చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి (young woman) వినూత్నంగా రీల్ (Reel) చేసేందుకు సిద్ధమవుతుంది. ఇందుకోసం రోడ్డు పక్కన కెమెరాను ఏర్పాటు చేసుకుని.. ‘‘ఫ్రెండ్స్ ఈ రోజు చెత్త డబ్బా స్టంట్ ఎలా ఉంటుందో చూడండి’’.. అంటూ సంతోషంతో గంతులేస్తూ పక్కన ఉన్న చెత్త బుట్ట వద్దకు వెళ్తుంది. మూత తీసి అందులో కూర్చుని మూసేస్తుంది. అయితే కాసేపటికి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. యువతి చెత్త డబ్బాలో (dust bin) కూర్చున్న కొద్ది సేపటికి వ్యాన్ వస్తుంది. రోజూ లాగే బుట్టను ఇనుప హ్యాండిల్‌తో పట్టుకుని పైకి ఎత్తి లారీలో పడేస్తుంది.
తర్వాత సదరు వాహనం అక్కడి నుంచి సాఫీగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత శానిటరీ సిబ్బంది అక్కడికి వచ్చి, ఖాళీ డబ్బాను తీసుకెళ్తారు. ఇదిలావుండగా, లారీలో యువతి పరిస్థితి ఏంటో అని అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో! ఇది నిజమేనా.. పాపం యువతి పరిస్థితి ఏంటో’’.. అని కొందరు, ‘‘ఈ వీడియోను ఎడిట్ చేశారు’’.. అని ఇంకొందరు, ‘‘ఇలాంటి వీడియోలు చేయడం ప్రమాదకరం’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-06-24T16:08:48+05:30 IST