ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: వామ్మో.. ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఇన్‌స్టా అకౌంట్‌ను ఓపెన్ చేసి అనుకున్నది సాధించేసింది..!

ABN, First Publish Date - 2023-06-04T15:04:45+05:30

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సూదర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం ఇట్టే స్నేహితులైపోతున్నారు. ఒక్క క్లిక్‌తో ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సౌలభ్యం కూడా వచ్చేసింది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఓ మనిషి ఇంకో మనిషిని కాంటాక్ట్ అవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఏ ఆధారం లేకుండా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సూదర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం ఇట్టే స్నేహితులైపోతున్నారు. ఒక్క క్లిక్‌తో ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సౌలభ్యం కూడా వచ్చేసింది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఓ మనిషి ఇంకో మనిషిని కాంటాక్ట్ అవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఏ ఆధారం లేకుండా మనిషిని గుర్తించి, మాట్లాడడం మాత్రం కొంచెం కష్టమైన పనే. కానీ తలుచుకోవాలే కానీ.. అది చాలా ఈజీ అని ఓ యువతి నిరూపించింది. ఇన్‌స్టా అకౌంట్‌ను ఓపెన్ చేసి, ఒకే ఒక పోస్టు పెట్టింది. అది ఎవరికి చేరాలనుకుందో సరిగ్గా వారికే చేరిపోయింది. ప్రస్తుతం ఈ యువతికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ చక్కర్లు కొడుతోంది. నేహా అనే యువతికి తన చిన్ననాటి స్నేహితురాలిని (childhood friend) కలవాలి, మాట్లాడాలి అని కోరిక ఉండేదట. కానీ ఆమె అడ్రస్, ఫోన్ నంబర్ వంటివి ఏమీ లేవు. కొన్నేళ్లుగా ఆమె చాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయినా పట్టు వదలకుండా ఎలాగైనా తన స్నేహితురాలితో మాట్లాడాలి అనే అనుకుంటూ ఉండేది. ఈ క్రమంలో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ఇన్‌స్టా (Instagram)లో @finding_lakshita పేరుతో ప్రొఫైల్‌ను క్రియేట్ చేసింది. తర్వాత తన స్నేహితురాలి గురించి తనకు తెలిసిన సమాచారాన్ని జోడిస్తూ "నా చిరకాల తప్పిపోయిన చిన్ననాటి స్నేహితురాలు "లక్షితా" వయస్సు - 21. ఆమె సోదరుడు - కునాల్‌ని కనుగొనే లక్ష్యంతో నేను ఉన్నాను." అని సందేశాన్ని రాసింది.

Viral News: ఆఫీసులో ఒకటికి రెండుసార్లు బాత్రూంకు వెళ్తే మాత్రం జాబ్‌లోంచి తీసేయడమేంటంటూ కోర్టుకెళ్లాడో ఉద్యోగి.. తీరా చూస్తే..!

తర్వాత ఈ సందేశాన్ని లక్షితా పేరుతో ఉన్న ప్రొఫైల్స్ అన్నింటికీ పంపించింది. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించింది. చివరకు నేహా స్నేహితురాలి నుంచి మెసేజ్ వచ్చింది. స్నేహితురాలిని కనుగొన్న ఆనందంలో.. ‘‘మిషన్ విజయవంతమైంది. నా స్నేహితురాలిని కనుగొన్నాను’’.. అని అదే ప్రొఫైల్‌లో వివరణ ఇచ్చింది. సుమారు 18 సంవత్సరాల తర్వాత తన స్నేహితురాలిని కలిశానని, ఎల్‌కేజీ చదువుతున్న సమయంలో లక్షిత తనకు ఫ్రెండ్ అయిందని, తర్వాత వారి కుటుంబం జైపూర్ (Jaipur) వెళ్లిందని.. అప్పటి నుంచి తనకు దూరమైందని నేహా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా, దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: కొంపదీసి ఆమె భర్త విడాకులు ఇస్తాడా ఏంటి..?.. పెళ్లి వేడుకలో ఈ మహిళ డాన్స్ చూసి నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

Updated Date - 2023-06-04T15:04:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising