Viral News: రాత్రి అన్నం తిన్న వెంటనే 26 ఏళ్ల యువతి మృతి.. తల్లిదండ్రులు చూస్తుండగానే ఘోరం.. ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు ఏం తేల్చారంటే..!
ABN, First Publish Date - 2023-05-28T15:28:26+05:30
సంతోషంగా ఉన్న సమయంలో కొన్నిసార్లు సడన్‌గా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కుటుంబ సభ్యులతో అప్పటిదాకా ఆనందంగా ఉన్న వారు అంతలోనే విగతజీవులుగా మారుతూ విషాదాన్ని నింపుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు తరచూ వింటూనే ఉంటాం. ఇటీవల..
సంతోషంగా ఉన్న సమయంలో కొన్నిసార్లు సడన్‌గా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కుటుంబ సభ్యులతో అప్పటిదాకా ఆనందంగా ఉన్న వారు అంతలోనే విగతజీవులుగా మారుతూ విషాదాన్ని నింపుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు తరచూ వింటూనే ఉంటాం. ఇటీవల ఓ యువతికి సంబంధించిన వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి అన్నం తిన్న 26 ఏళ్ల యువతి.. తల్లిదండ్రులు చూస్తుండగానే కుప్పకూలిపోయింది. చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చివరకు వైద్యులు ఏం తేల్చారంటే..
ఆస్ట్రేలియాకు (Australia) చెందిన డాలి డుచాటెల్ (26) అనే యువతి (young woman) తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఈమెకు ప్రపంపం మొత్తం చుట్టి (World trip) రావాలనేది కోరిక. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. అయితే ఆమె కల తీరకుండానే అనూహ్య ఘటనతో తిరిగిరాని లోకాలకు చేరుకుంది. ఇటీవల ఆమె (road accident) రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యువతి కాలు విరిగింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆమె కాలికి శస్త్రచికిత్స (surgery) నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఇంటి వద్దే ఉంటోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. మే 21 రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా భోజనం చేసింది. అయితే తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. దీంతో తల్లిదండ్రులు కంగారుగా వచ్చి చూడగా స్పృహలో లేదు.
తల్లికి అనుమానం వచ్చి కూతురికి వెంటనే సీపీఆర్ (Cardio pulmonary resuscitation) చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అంతవరకూ సంతోషంగా ఉన్న కూతురు.. ఉన్నట్టుండి విగతజీవిగా మారడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. వైద్యులు మాట్లాడుతూ యువతి కాలికి జరిగిన శస్త్ర చికిత్స కారణంగా రక్తం గడ్డకట్టడం, పల్మనరీ ఎంబాలిజం ఏర్పడిందని చెప్పారు. ఈ కారణంగానే మరణం సంభవించిందని తేల్చారు. అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబం.. కుమార్తె మృతితో మరింత కష్టాల్లోకి వెళ్లింది. యువతి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆమె స్నేహితులు GoFundMe అనే సోషల్ మీడియా వేదికగా విరాళాలను అందించాల్సిగా అభ్యర్థిస్తున్నారు.
Updated Date - 2023-05-28T15:28:26+05:30 IST