ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియుడికి వేరే అమ్మాయితో పెళ్లి.. తనతో మాట్లాడటమే మానేశాడని ఓ యువతి అనూహ్య నిర్ణయం.. ఓ లేఖ రాసి..

ABN, First Publish Date - 2023-02-09T15:37:06+05:30

ప్రేమలో విఫలమైన వారిలో చాలా మంది.. గతం మర్చిపోయి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు. కొందరు పదే పదే గతం తలుచుకుంటూ అదే ధ్యాసలో ఉంటూ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమలో విఫలమైన వారిలో చాలా మంది.. గతం మర్చిపోయి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు. కొందరు పదే పదే గతం తలుచుకుంటూ అదే ధ్యాసలో ఉంటూ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువైపోయాయి. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రియుడికి వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసింది. అప్పటి నుంచి మాట్లాడటమే మానేయడంతో చివరకు యువతి.. ఓ లేఖ రాసి అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌లోని ఏరోడ్రోమ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన పూజ(27) అనే యువతి (young woman) భన్వర్కువాన్‌లో ఉన్న ఓ ఆస్పత్రిలో ఏడాది కాలంగా నర్సుగా (Nurse Job) పని చేస్తోంది. వీరి కుటుంబం బెంగాలీ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయింది. పూజ తండ్రి మాధవ్ ఫ్యాక్టరీలో, తల్లి రామ్‌కిషన్ మిషన్‌లో పని చేస్తున్నారు. అలాగే పూజ చెల్లెలు కూడా ఓ ప్రైవేట్ కంపెనీ పని చేస్తోంది. అంతా ఎవరి పనుల్లో వారు సంపాదిస్తుండడంతో వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవు. అయితే ఇదిలావుండగా, ఇటీవల పూజ సదరు ఆస్పత్రిలో పని మానేసి, మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది.

Viral Video: షూ నుంచి పొడుచుకు వచ్చిన పాములు.. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే.. ఆశ్చర్యకరంగా..

ఇక్కడ పని చేస్తున్న ఆదేవ్ అనే యువకుడు (young man) పూజకు పరిచయమయ్యాడు. తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ (love) మొదలైంది. మూడేళ్లుగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ముందు ఓకే చెప్పిన ఆదేశ్.. క్రమంగా పూజను చేసుకునేందుకు నిరాకరించాడు. తనకు చిన్నతనంలోనే పెళ్లి ఫిక్స్ అయిందని, ఆమెనే వివాహం చేసుకుంటానని చెప్పాడు. 2022 నవంబర్ నుంచి పూజను పూర్తిగా దూరం పెట్టాడు. అయితే ఆదేశ్‌ని మర్చిపోయి.. పూజ ఉండలేకపోయింది. తనతో మాట్లాడటానికి అనేక రకాలుగా ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు.

అమ్మాయి పెదవులపై వంద నోటును పెట్టి.. అతడు చేసిన నిర్వాకానికి.. కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వచ్చిందంటే..

దీంతో చివరకు మానసికంగా తీవ్రంగా (mental stress) కుంగిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం షాకింగ్ నిర్ణయం (Shocking decision) తీసుకుంది. రాత్రి ఇంటికి చేరుకుని, రెండు పేజీల లేఖ రాసి.. గుర్తు తెలియని ఇంజెక్షన్ (Venom injection) చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి ఇంటికి వచ్చిన తల్లి.. అపస్మారక స్థితిలో పడి ఉన్న కూతర్ని చూసి షాక్ అయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పూజ మృతి (died) చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: ఇదేం పిచ్చిరా బాబూ.. శోభనం వీడియోను నెట్టింట పోస్ట్ చేసిన నవ దంపతులు.. మండిపడుతున్న నెటిజన్లు..!

Updated Date - 2023-02-09T15:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising