ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రీల్స్ తెచ్చిన తంటా.. ఓ చేత్తో అమ్మాయి చేయి.. మరో చేతిలో గులాబీ పట్టుకుని రీల్స్ స్టార్ట్.. మరుక్షణంలోనే..

ABN, First Publish Date - 2023-08-04T14:54:52+05:30

ప్రస్తుతం ఇన్‌‌స్టాగ్రామ్ రీల్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా మంది యువతీయువకులు ప్రస్తుతం రీల్స్ చేయడం, చూడడం కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయితే అందరినీ ఆకట్టుకునేలా రీల్స్ కోసం వీడియో రూపొందించడం ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి చాలా నైపుణ్యం అవసరం.

ప్రస్తుతం ఇన్‌‌స్టాగ్రామ్ రీల్స్‌ (Instagram Reels)కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా మంది యువతీయువకులు ప్రస్తుతం రీల్స్ చేయడం, చూడడం కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయితే అందరినీ ఆకట్టుకునేలా రీల్స్ కోసం వీడియో రూపొందించడం ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి చాలా నైపుణ్యం అవసరం. కెమెరా యాంగిల్, యాక్టింగ్, ఎడిటింగ్ సహా చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. స్టంట్ వీడియోలు చేయాలనుకున్నప్పుడు ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి (Stunt Videos).

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)లో యువతీయువకులు రీల్స్ చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఓ యువకుడు అనుకోని ప్రమాదానికి గురై గాయపడ్డాడు. @iam_haryanvii అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఓ పార్క్‌లో కొందరు యువతీయువకులు రీల్స్ కోసం షూటింగ్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఒక యువకుడు ఓ అమ్మాయి చేయి పట్టుకుని నడుస్తున్నాడు. మరో చేతిలో గులాబీ పూవు ఉంది. ఆ యువకుడు యువతి చేయి పట్టుకుని అకస్మాత్తుగా బ్యాక్‌ఫ్లిప్ (Backflip) చేయడానికి ప్రయత్నించాడు.

Viral Video: దొంగ ఎలుక.. ఎవరూ లేనపుడు డైమండ్ నెక్లెస్‌ను ఎలా కాజేసిందో చూడండి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

అతడు గాల్లో ఉండగా వెనుక నుంచి మరో అమ్మాయి వచ్చింది. దాంతో ఇద్దరూ ఒకరినొకరు ఢీకొని కింద పడిపోయారు. అమ్మాయికి ఏమీ అవలేదు కానీ, అబ్బాయికి మాత్రం నడుము భాగంలో గాయాలు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాదాపు 1.50 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Updated Date - 2023-08-04T14:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising