Viral Video: హెలీకాఫ్టర్ ఎగురుతున్న సమయంలో సెల్ఫీ కోసం వెళ్లిన యువకుడు.. అయితే సడన్‌గా చోటు చేసుకున్న ఊహించని ఘటనతో..
ABN, First Publish Date - 2023-07-18T16:07:26+05:30
సెల్ఫీల పిచ్చితో కొందరు యువతీయువకులు చేసే పనులు ఎదుటి వారికి ఆగ్రహం కలిగిస్తుంటాయి. మరికొందరు ఇదే సెల్ఫీల పిచ్చితో చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. జంతువులతో ఫొటోలు తీసుకుంటూ కొందరు, రైలు పట్టాలపై మరికొందరు, కదులుతున్న సమయంలో..
సెల్ఫీల పిచ్చితో కొందరు యువతీయువకులు చేసే పనులు ఎదుటి వారికి ఆగ్రహం కలిగిస్తుంటాయి. మరికొందరు ఇదే సెల్ఫీల పిచ్చితో చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. జంతువులతో ఫొటోలు తీసుకుంటూ కొందరు, రైలు పట్టాలపై మరికొందరు, కదులుతున్న సమయంలో రైలు బోగీ తలుపు వద్ద ఫొటోలు తీసుకుంటూ ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి హెలీకాఫ్టర్ ఎగురుతున్న సమయంలో సెల్ఫీ కోసం దగ్గరగా వెళ్లాడు. చివరకు ఏం జరిగిందంటే..
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో (Kedarnath Uttarakhand) ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్న విషయం తెలిసిందే. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. దీంతో రెస్క్యూ టీం (Rescue team) రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. అయితే ఈ సమయంలో ఓ వీడియో సోషల్ మీడియాలో (Viral video) తెగ వైరల్ అవుతోంది. వరద బాధితుల సహాయార్థం వచ్చిన హెలీకాప్టర్లను కొందరు ఆసక్తిగా గమనిస్తుంటారు. ఇంతలో ఓ హెలీకాప్టర్ (Helicopter) గాల్లోకి లేచేందుకు సిద్ధంగా ఉంటుంది. అదే సమయంలో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తాడు.
Viral Video: ఎందుకొచ్చిన పెళ్లిరా అంటూ తల పట్టుకున్న వధూవరులు... భోజన సమయంలో యువకుల నిర్వాకంతో..
హెలీకాప్టర్ దగ్గరగా వెళ్లి ఫొటోల తీసుకునేందుకు ప్రయత్నిస్తాడు. సమీపానికి వెళ్లి సెల్ఫీ (Selfie) తీసుకుంటుండగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గమనిస్తారు. వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి.. సదరు యువకుడి చెంప చెల్లుమనిస్తాడు. అక్కడి నుంచి దూరంగా వెళ్లమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మరో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది.. యువకుడిని వెంబడించి ‘‘ఇంకోసారి ఇటువైపు వస్తే నీ సంగతి చెబుతా’’... అంటూ కాలితో తన్నుతారు.. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘సెల్ఫీల కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు’’.. అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-07-18T16:07:26+05:30 IST