YouTube: యూట్యూబ్ ఆ వీడియోలను ఎందుకు డిలీట్ చేస్తోంది.. కొద్ది వారాల పాటు అదే పనిలో ఉండబోతోందట..!
ABN, First Publish Date - 2023-08-17T11:09:01+05:30
ఆగస్టు 15వ తేదీన యూట్యూబ్ ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని బ్లాగ్ పోస్ట్ ద్వారా అందరికీ తెలియజేసింది. దీనికి అనుగుణంగా ఇప్పటికే యూట్యూబ్ లో కొన్ని వర్గాలకు చెందిన వీడియోలు తొలగిస్తున్నారు. కేవలం ఒకటిరెండురోజులు ఈ పనిచేసి మ్యా.. మ్యా అనిపించుకోకుండా ఏకంగా కొన్ని వారాలపాటు ఈ తొలగింపు ప్రక్రియ సాగిస్తుంది.
విద్య,వైద్యం, ఆరోగ్యం, రాజకీయం, ఎంటర్టైన్మెంట్, గాసిప్స్, సీక్రెట్స్, ట్యాలెంట్.. ఇలా ఒకటనేమిటి సకల సమాచారానికి యూట్యూబ్ పెద్ద వేదిక. విషయం ఎలాంటిదైనా యూట్యూబ్ లో చూసి తెలుసుకోవచ్చు. ఎంతోమంది ఆరోగ్యం, అందం, వంటా వార్పుకు సంబంధించి రోజువారీ పనులు యూట్యూబ్ లో పెడుతూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఆగస్టు 15వ తేదీన యూట్యూబ్ ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని బ్లాగ్ పోస్ట్ ద్వారా అందరికీ తెలియజేసింది. దీనికి అనుగుణంగా ఇప్పటికే యూట్యూబ్ లో కొన్ని వర్గాలకు చెందిన వీడియోలు తొలగిస్తున్నారు. కేవలం ఒకటిరెండురోజులు ఈ పనిచేసి మ్యా.. మ్యా అనిపించుకోకుండా ఏకంగా కొన్ని వారాలపాటు ఈ తొలగింపు ప్రక్రియ సాగుతుందని వారు చెప్పడం గమనార్హం. అసలు యూట్యూబ్ తొలగిస్తున్న వీడియోలు ఏంటి? వీటిని ఎందుకు తొలగిస్తున్నారు? పూర్తీగా తెలుసుకుంటే..
యూట్యూబ్(YouTube) లో చాలావరకు వైరల్ అయ్యే వార్తలలో ఆరోగ్యానికి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. పరిశోధనలతో సంబంధం లేకుండా ఫలానా టిప్స్ ఫాలో అయితే ఫలానా సమస్య తొలగిపోతుందని, ఫలానా ఆహారం తీసుకుంటే ట్రీట్మెంట్ కూడా అవసరం లేదని చెబుతుంటారు. ఎంతోమంది వీటిని ఫాలో అవుతుంటారు కూడా. కానీ ఆగస్టు 15వ తారీకున యూట్యూబ్ ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. వైద్య విధానాలకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెలువరిచే విషయాలకు విరుద్దంగా , వైద్యం విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం .. ఇలాంటి వీడియోలను అన్నింటిని తొలగించబోతున్నట్టు యూట్యూబ్ పేర్కొంది. చాలావరకు హెల్త్ టిప్స్ కు సంబంధించిన ఛానెల్స్ లో 'వెల్లుల్లి వాడితే చాలు క్యాన్సర్ ను జయించవచ్చనో.. లేదంటే..వెల్లుల్లి క్యాన్సర్ ను నయం చేస్తుందనో చెప్పడం. 'రేడియేషన్ థెరపీ చికిత్స ఎందుకు? ఎంచక్కా విటమిన్-సి తీసుకోండి' అని థంబ్ నెయిల్స్ పెట్టడం చూసే ఉంటాం. 'రోజూ ఈ ఆహారం కొంచెం తింటే చాలు ఏ వైరస్ ఏమీ చేయలేదు', 'ఊపిరితిత్తులు పాడైపోతే వైద్యులు అక్కర్లేదు ఇంట్లో ఇలా చేస్తే చాలు' ఇలాంటి థంబ్ నెయిల్స్, ఇటువంటి విషయాలకు సబంధించిన సమాచారం జొప్పించిన వీడియోలు తొలగిస్తాం అని తెలిపింది. రాబోయే కొన్ని నెలలు ఈ తొలగింపు ప్రక్రియను కొనసాగించనుంది. ఈ తిరస్కరణను మూడు వర్గాలుగా విభజించింది. నివారణ, చికిత్స, తిరస్కరణ మొదలైన అంశాలుగా మార్చింది. దీని ప్రకారం యూట్యూబ్ కంటెంట్ ఆరోగ్య సమస్యల నివారణ పేరుతోనూ, చికిత్స పేరుతోనూ ఉండటమే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలిబుచ్చే విషయాలను, WHO ఆమోదం పొందిన వివిధ రకాల వైద్యవిధానాలు, పరిశోధనల్లో వెలువడిన విషయాలను, మందులకు తిరస్కార భావంతో, విమర్శలతో కూడిన కంటెంట్ ను తొలగించబోతోంది.
Airport: విమానాశ్రయంలోని బాత్రూంలో పర్సు, బ్యాగులను మర్చిపోయిందో మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
యూట్యూబ్ లో చాలావరకు ప్రజా ప్రయోజనాలకోసమంటూ అప్లోడ్ చేయబడిన వైద్య, ఆరోగ్య వీడియోల ద్వారా ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పుకొచ్చింది. కానీ వ్యక్తిగత సాక్ష్యాలు, నిర్ధిష్టమైన వైద్య అధ్యయనం ద్వారా క్రియేట్ చేసిన కంటెంట్ కు, అలాంటి వీడియోలకు, ఆరోగ్య స్పృహ కోణంలో చర్చావేదికగా నిలిచే వీడియోలకు మినహాయింపు ఉంటుందని యూట్యూబ్ పేర్కొంది. ఇది మాత్రమే కాకుండా ఇకమీదట వీక్షకులు ఆరోగ్యపరమైన వీడియోలు చూసేటప్పుడు వయస్సు దృవీకరణ నియమాన్ని పెడుతన్నట్టు యూట్యూబ్ తెలిపింది. కంటెంట్ క్రియేటర్స్, కంటెంట్ పార్ట్నర్స్, వీక్షకులు మొదలైనవారికి, కంపెనీ విధానం సులభతరం చెయ్యడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది. దీని ప్రకారం యూట్యూబ్ లో పొంతన లేకుండా అప్లోడ్ చేయబడిన ఆరోగ్యానికి, వైద్యానికి సంబంధించిన వీడియోలు తొలగింపు ప్రక్రియ సాగుతోంది.
Food Habits: రోజూ పొద్దున్నే ఈ 5 రకాల టిఫిన్లను మాత్రం అస్సలు తినకండి.. పొరపాటున తింటే జరిగేది ఇదే..!
Updated Date - 2023-08-17T11:20:34+05:30 IST