WTC Final: ఐపీఎల్‌లో అదరగొట్టిన రహానేకు డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు..
ABN, First Publish Date - 2023-04-25T11:50:18+05:30
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అజింక్య రహానే టీమ్ ఇండియా జట్టులోకి తిరిగి వచ్చారు....
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అజింక్య రహానే టీమ్ ఇండియా జట్టులోకి తిరిగి వచ్చారు.(Ajinkya Rahane)జూన్ 7 వతేదీ నుంచి లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు(World Test Championships Final) చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అజింక్య రహానె భారత జట్టులోకి తిరిగి తీసుకువచ్చారు.(Comeback Into Team India Squad )భారత మాజీ కెప్టెన్,చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్ అజింక్య రహానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023 సీజన్‌లో తన అద్భుతమైన ఫామ్‌కు రివార్డ్ పొందారు.
ఇది కూడా చదవండి : Supreme Court: మహిళా రెజ్లర్ల వినతిపై ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు
ఈ సీజన్ ప్రారంభంలో ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్‌కే కోసం 199 స్ట్రైక్ రేట్‌తో అరంగేట్రం చేసిన తర్వాత రహానే సంచలన ఫామ్‌లోకి వచ్చారు. గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రహానే జట్టులోకి వచ్చారు.ముంబై, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఆల్-రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులోకి తిరిగి వచ్చారు.
భారత టెస్టు జట్టు డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
Updated Date - 2023-04-25T12:15:53+05:30 IST