Syed Mushtaq Ali Trophy: బ్యాటర్లకు షాక్!.. ఇకపై ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు
ABN, First Publish Date - 2023-07-08T15:33:41+05:30
దేశీయ టీ20 లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో (Syed Mushtaq Ali Trophy) బీసీసీఐ (BCCI) కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి బౌలర్లు ఒక ఓవర్లో రెండు బౌన్సర్లను (Two bouncers) వేయొచ్చని ప్రకటించింది. బ్యాట్, బాల్ మధ్య సమతుల్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వెల్లడించింది.
దేశీయ టీ20 లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో (Syed Mushtaq Ali Trophy) బీసీసీఐ (BCCI) కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి బౌలర్లు ఒక ఓవర్లో రెండు బౌన్సర్లను (Two bouncers) వేయొచ్చని ప్రకటించింది. బ్యాట్, బాల్ మధ్య సమతుల్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. శుక్రవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో (Apex Council meeting) ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు ఒక ఓవర్లో ఒక బౌన్సర్ వేయడానికి మాత్రమే అవకాశం ఉండేది. మరో బౌన్సర్ వేస్తే అంపైర్లు నో బాల్‌గా ప్రకటించేవారు. బీసీసీఐ తాజా నిర్ణయంతో ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లను వేసేందుకు బౌలర్లకు అవకాశం దక్కింది. ఈ నిబంధన బౌలర్లకు సానుకూలంగా మారనుంది. అదే సమయంలో బ్యాటర్లకు ఇది ప్రతికూలంగా మారనుంది. అయితే ఈ నిబంధన ముస్తాక్ అలీ ట్రోఫీ వరకు మాత్రమే.
దీంతోపాటు గత ఐపీఎల్‌లో(IPL2023) ప్రవేశపెట్టిన ఇంపాక్టు ప్లేయర్(Impact Player) నిబంధనను కూడా ముస్తాక్ అలీ ట్రోఫీలో అమలు చేయనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అయితే టాస్ సమయంలోనే ఇంపాక్టు ప్లేయర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. 11 మంది ఆటగాళ్లతోపాటు నలుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్ల వివరాల్ని కూడా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆ నలుగురిలో నుంచి ఒక్కరినే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలి. అది కూడా ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్ ముగిసే లోపే ఇంపాక్ట్ ప్లేయర్‌ను మైదానంలోకి తీసుకురావాలి. అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌ను కచ్చితంగా ఉపయోగించాలి అని కూడా ఏం లేదు. ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఉపయోగించుకోవాలా? లేదా? అనే నిర్ణయం ఆయా జట్లకే వదిలేసింది బీసీసీఐ. కాగా అక్టోబర్ 16 నుంచి ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ జరగనుంది.
Updated Date - 2023-07-08T15:33:41+05:30 IST