India vs Sri Lanka: నిప్పులు చెరుగుతున్న శ్రీలంక బౌలర్లు.. టపటపా రాలుతున్న భారత్ వికెట్లు
ABN, First Publish Date - 2023-01-05T21:17:18+05:30
శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు(Team India)కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి.
పూణె: శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు(Team India)కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. శ్రీలంక (Sri Lanka) నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 12 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ (Ishan Kishan) వికెట్‌ను కోల్పోయింది. 5 బంతులు ఆడి 2 పరుగులు మాత్రమే చేసిన ఇషాన్ కిషన్.. కాసున్ రజిత బౌలింగులో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత 21 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ఐదేసి పరుగులు చేసిన శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠిలను రజిత, దిల్షాన్ వెనక్కి పంపారు. నిప్పులు చెరుగుతున్న లంక బౌలర్లను అడ్డుకోవడంలో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిశాయి. టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (6), సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
Updated Date - 2023-01-05T21:22:46+05:30 IST