కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPL 2024: వచ్చే సీజన్‌లో ధోనీ ఆడటం డౌటే.. అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-11-27T18:11:15+05:30

Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న ధోనీ వచ్చే సీజన్ ఆడాలంటే అందుకు తగ్గట్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తనకు తెలిసినంతవరకు ధోనీ సీజన్ మొత్తం ఆడే అవకాశాలు లేవని కుంబ్లే స్పష్టం చేశాడు. వచ్చే సీజన్‌లో ధోనీ ఆడటం డౌటేనని.. అతడు ఎప్పుడు జట్టు వీడతాడో ఎవరూ అంచనా వేయలేరని పేర్కొన్నాడు.

IPL 2024: వచ్చే సీజన్‌లో ధోనీ ఆడటం డౌటే.. అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ ఎవరంటే అందరూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెప్పక మానరు. సీఎస్కేకు ఐదు టైటిళ్లు అందించి అందరి ప్రశంసలతో పాటు క్రేజ్‌ను ధోనీ సంపాదించుకున్నాడు. అయితే ధోనీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవడం, అతడి ఫిట్‌నెస్ దృష్ట్యా వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడతాడా.. లేదా అన్న సందిగ్ధం అందరిలో నెలకొంది. కానీ ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలో ధోనీ పేరును చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తావించడంతో అతడు వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడతాడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే ధోనీ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న ధోనీ వచ్చే సీజన్ ఆడాలంటే అందుకు తగ్గట్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తనకు తెలిసినంతవరకు ధోనీ సీజన్ మొత్తం ఆడే అవకాశాలు లేవని కుంబ్లే స్పష్టం చేశాడు. వచ్చే సీజన్‌లో ధోనీ ఆడటం డౌటేనని.. అతడు ఎప్పుడు జట్టు వీడతాడో ఎవరూ అంచనా వేయలేరని పేర్కొన్నాడు.

అయితే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ధోనీ ఇంకా ఆడాలని భావిస్తు్న్నారని కుంబ్లే అన్నాడు. శారీరకంగా సిద్ధమైతే తప్పకుండా ధోనీ ఆటను వచ్చే సీజన్‌లో వీక్షించే అవకాశం ఉంటుందని.. కానీ గత సీజన్‌లోనే అతడు 100 శాతం ఫిట్‌గా లేడని కుంబ్లే వెల్లడించాడు. ఫిట్‌నెస్ లేకపోయినా వికెట్ల వెనుక ధోనీ చురుగ్గానే ఉన్నాడని.. బ్యాటింగ్‌లో ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించాడని కుంబ్లే వివరించాడు. కానీ గత సీజన్ ముగిసిన తర్వాత ఇప్పటివరకు ధోనీ మళ్లీ క్రికెట్ ఆడలేదని.. దీంతో అతడు మళ్లీ మైదానంలోకి దిగితే ఏ మేరకు ప్రదర్శన చేస్తాడన్న విషయం ఆసక్తికరంగా మారిందన్నాడు. మరోవైపు ఒకవేళ ధోనీ వచ్చే సీజన్‌లో ఆడకపోతే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను నియమించే అవకాశం ఉందని టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా అంచనా వేశాడు. సీఎస్‌కే రిటెన్షన్‌ లిస్ట్‌లో ధోనీ కూడా ఉన్నాడని.. అయితే సీజన్‌ మధ్యలో జట్టు నుంచి వైదొలుగుతాడనే వార్తలను ఖండిస్తున్నట్లు చోప్రా తెలిపాడు. మోకాలి ఆపరేషన్ ఆందోళన పరిచే విషయమేనని.. కానీ ధోనీ మేనేజ్ చేసి మైదానంలో బరిలోకి దిగే విషయం కొట్టిపారేయలేమని పేర్కొన్నాడు. స్టోక్స్ తదుపరి కెప్టెన్ అని గత సీజన్‌లో ఊహాగానాలు నడిచాయని.. కానీ ఇప్పుడు స్టోక్స్‌ను రిటెన్షన్ చేసుకోకపోవడంతో ఊహాగానాలకు తెరపడినట్లేనని ఆకాష్ చోప్రా వివరించాడు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-27T18:11:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising