ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs Australia final: టీమిండియాతో ఫైనల్‌ ముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్

ABN, First Publish Date - 2023-11-17T13:15:46+05:30

రికార్డు స్థాయిలో 8వసారి ఫైనల్‌ చేరిన ఆస్ట్రేలియా అహ్మదాబాద్ వేదికగా టీమిండియాను (India Vs Australia Final) ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఆదివారం భారత్‌తో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌పై ఆసీస్ స్టార్ పేపర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఆసక్తికరంగా స్పందించాడు.

వరల్డ్ కప్ 2023లో (World cup 2023) భాగంగా కోల్‌కతా వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఉత్కంఠభరిత విజయం సాధించింది. రికార్డు స్థాయిలో 8వసారి ఫైనల్‌ చేరుకొని అహ్మదాబాద్ వేదికగా టీమిండియాను (India Vs Australia Final) ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఆదివారం భారత్‌తో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌పై ఆసీస్ స్టార్ పేపర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఆసక్తికరంగా స్పందించాడు.


భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌కు ముందు ముంబై వాంఖడే పిచ్‌ను మార్చారంటూ విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ‘ఫైనల్ మ్యాచ్‌ పిచ్‌’పై స్టార్క్ స్పందించాడు. శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత పిచ్ ఎలా ఉందో తెలుసుకుంటామని సరదాగా వ్యాఖ్యానించాడు. ఫ్రెష్ వికెటో లేక పాత వికెటో చూసి చెబుతామని అన్నాడు. ఇక దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన కోల్‌కతా ఈడెన్ గార్డెన్ పిచ్‌పై ప్రశ్నించగా.. పాత వికెట్ అని అన్నాడు. తొలుత బ్యాటింగ్ చేయడం కష్టమో కాదో తాను కచ్చితంగా చెప్పలేనని అభిప్రాయపడ్డాడు. స్వింగ్ ఎంతసేపు లభిస్తుందో అంచనా వేయలేకపోయామని తెలిపాడు. మొదటి 10 ఓవర్లు బ్యాటింగ్ చేయడం సంక్లిష్టంగా అనిపిస్తుందని భావించినట్టు వెల్లడించాడు.

Updated Date - 2023-11-17T13:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising