ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Asia Cup 2023: తోక ముడిచిన బంగ్లా పులులు.. తక్కువ స్కోరుకే ఆలౌట్

ABN, First Publish Date - 2023-08-31T19:04:15+05:30

శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడకుండా బంగ్లా పులులు తోక ముడిచారు. శ్రీలంక బౌలర్లు విజృంభించడంతో 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

ఈ ఏడాది ఎలాగైనా ఆసియా కప్ టైటిల్ గెలవాలని బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక చుక్కలు చూపించింది. పల్లెకెలె వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అరంగేట్రం చేసిన బంగ్లా బ్యాటర్ తంజిద్ హసన్ కనీసం ఖాతా కూడా తెరవకుండా డకౌట్‌గా వెనుతిరిగాడు. అయితే ఆ తర్వాత కూడా వరుసగా బంగ్లాదేశ్ వికెట్లను కోల్పోయింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడకుండా బంగ్లా పులులు తోక ముడిచారు. శ్రీలంక బౌలర్లు విజృంభించడంతో 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

ఇది కూడా చదవండి: Team India: హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్

బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో నజ్ముల్ హుస్సేన్ శాంతో ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలిచింది. అతడు ఆదుకోకపోతే బంగ్లా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. నజ్ముల్ 122 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సహాయంతో 89 పరుగులు చేశాడు. ఆ తర్వాత అత్యధిక స్కోరు తౌహిద్ హ్రిదోయ్‌దే. అతడు 20 పరుగులు చేశాడు. కెప్టెన్ షకీబుల్ హసన్ 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. శ్రీలంక బౌలర్లలో ఐపీఎల్‌ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ మతీష పతీరణ 4 వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్ నడ్డి విరిచాడు. 7.4 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 32 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహీష్ తీక్షణ 2 వికెట్లు తీయగా.. ధనుంజయ డిసిల్వ, దునిత్ వెల్లెగె, దాసున్ షనక తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే 165 పరుగులు చేయాల్సి ఉంది.

Updated Date - 2023-08-31T19:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising