IPL 2024: బీసీసీఐ కీలక నిర్ణయం.. మరింత పెరగనున్న ఐపీఎల్ రేంజ్?
ABN, First Publish Date - 2023-07-24T14:36:39+05:30
వచ్చే ఏడాది ఐపీఎల్ వేలం కోసం ఫ్రాంచైజీల పర్స్ పెంచాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో ఐపీఎల్ రేంజ్ మరింత పెరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ అంటే కాసుల వర్షం కురిపించే లీగ్ అని పేరుంది. తాజా సమాచారం ప్రకారం 2024 ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీ పర్సును రూ.100 కోట్లకు పెంచనుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్(IPL)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది ఐపీఎల్ వేలం కోసం ఫ్రాంచైజీల పర్స్ పెంచాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో ఐపీఎల్ రేంజ్ మరింత పెరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ అంటే కాసుల వర్షం కురిపించే లీగ్ అని పేరుంది. తాజా సమాచారం ప్రకారం 2024 ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీ పర్సును రూ.100 కోట్లకు పెంచనుంది. కొత్త పర్సు విలువతోనే ఈ ఏడాది చివర్లో జరిగే వేలంలో 10 ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. దీంతో ఎక్కువ మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలకు అవకాశం లభించనుంది. గత ఏడాది కూడా వేలానికి ముందు ఫ్రాంచైజీల పర్సుును బీసీసీఐ పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Indian doubles top shuttlers: ‘కొరియా’ను కొల్లగొట్టారు
మరోవైపు ఫ్రాంచైజీల పర్సును బీసీసీఐ పెంచనుండటంతో రిటైన్ ఆటగాళ్ల సంఖ్య కూడా పెరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆటగాళ్లను రిటైన్ చేసుకునే ప్రక్రియ ముగిసిన తర్వాతే ఐపీఎల్ నిర్వాహకులు వేలం నిర్వహించనున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ పండగ ముగిసిన తర్వాతే వేలం ప్రక్రియ ఉంటుందని టాక్ నడుస్తోంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ ఉండటంతో .. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఐపీఎల్ వేలం నిర్వహించే తేదీలను బీసీసీఐ ప్రకటించనుంది. గత ఏడాది ఐపీఎల్ వేలం కోచిలో నిర్వహించగా.. ఈ ఏడాది ఈ జాబితాలో ముంబై, జైపూర్, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలలో ఒకచోట వేలం నిర్వహించే అవకాశం ఉంది. కాగా గత ఏడాది ఐపీఎల్ వేలంలో 10 ఫ్రాంచైజీలు కలిసి రూ.167 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 80 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
Updated Date - 2023-07-24T14:36:39+05:30 IST