ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ben Stokes: టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టంచిన బెన్ స్టోక్స్!

ABN, First Publish Date - 2023-02-18T21:16:01+05:30

ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్‌(Brendon McCullum)ను అధిగమించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మౌంట్ మాంగనూయి: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్, టెస్ట్ స్కిప్పర్ బెన్ స్టోక్స్(Ben Stokes) ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్‌(Brendon McCullum)ను అధిగమించాడు. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య మౌంట్‌మాంగనూయిలో జరుగుతున్న తొలి టెస్టులో స్టోక్స్ ఈ ఘనత సాధించాడు. మ్యాచ్ మూడో రోజు ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు బాదిన స్టోక్స్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.

49వ ఓవర్‌లో న్యూజిలాండ్ బౌలర్ స్కాట్ కగెలీన్ వేసిన మూడో బంతిని ఫైన్‌ లెగ్ మీదుగా సిక్సర్‌గా మలిచిన స్టోక్స్.. మెకల్లమ్‌ను అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో స్టోక్స్ 33 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. స్టోక్స్‌కు ఇది 90వ టెస్ట్ కాగా తాజా సిక్సర్లతో కలిసి 109 సిక్సర్లు ఉన్నాయి. అలాగే, 12 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలతో 5,652 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 258 పరుగులు.

ఇక, 107 సిక్సర్లతో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మెకల్లమ్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. 101 టెస్టుల్లో మెకల్లమ్ ఈ ఘనత సాధించాడు. 100 సిక్సర్లతో గిల్‌క్రిస్ట్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్సర్లతో ఈ జాబితాలో టాప్-10లో ఉన్నాడు.

Updated Date - 2023-02-18T21:16:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising