ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jasprit Bumrah: కెప్టెన్‌గా తొలి టీ20లోనే చరిత్ర సృష్టించాడుగా..!!

ABN, First Publish Date - 2023-08-19T18:53:11+05:30

డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో తొలి ఓవర్‌లోనే బుమ్రా తన బౌలింగ్‌లో పదునుతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. . తొలి ఓవర్‌లోనే బుమ్రా రెండు వికెట్లు పడగొట్టి ఐర్లాండ్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాడు. దీంతొో కెప్టెన్‌గా ఆడుతున్న తొలి టీ20లోనే రెండు వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

సీనియర్ల గైర్హాజరీలో ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో యువ ఆటగాళ్లతో టీమిండియా బరిలోకి దిగింది. ఈ సిరీస్‌కు సీనియర్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కెప్టెన్‌గా బుమ్రాకు ఇది తొలి సిరీస్. సుమారు 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అతడు మైదానంలోకి దిగాడు. అయితే తొలి టీ20లోనే బుమ్రా చరిత్ర సృష్టించాడు. తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. కెప్టెన్‌గా ఆడుతున్న తొలి టీ20లోనే రెండు వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఇది కూడా చదవండి: Asia Cup 2023: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. గంటలోనే టిక్కెట్లన్నీ ఫుల్..!!

డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో తొలి ఓవర్‌లోనే బుమ్రా తన బౌలింగ్‌లో పదునుతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. చాలా కాలం తర్వాత బుమ్రా అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండటంతో అతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అని సందేహం వ్యక్తం చేసిన వాళ్లకు ఈ ఓవర్ సమాధానంగా కనిపించింది. తొలి ఓవర్‌లోనే బుమ్రా రెండు వికెట్లు పడగొట్టి ఐర్లాండ్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాడు. తర్వాత 3 ఓవర్లలో బుమ్రా వికెట్లేమీ తీయకపోయినా అతడు నిలకడైన వేగంతో బంతులు సంధించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అసాధారణ బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా టీ20ల్లో భారత్‌కు కెప్టెన్సీ వహించిన 11వ ప్లేయర్ బుమ్రా. టీ20ల్లో భారత్‌కు సారథ్యం వహించిన తొలి స్పెషలిస్ట్ బౌలర్ బుమ్రానే కావడం విశేషం.

ప్రమాదం నుంచి తప్పించుకున్న బుమ్రా

కాగా రీఎంట్రీలో తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసిన బుమ్రా మరోసారి గాయం బారిన పడేవాడు. అయితే కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే.. ఐర్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 14వ ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ బంతి అందుకున్నాడు. అతడు వేసిన బంతిని బ్యాటర్ గ్యాప్‌లోకి ఆడాడు. ఈ బాల్‌ను బుమ్రా ఛేజ్ చేశాడు. అదే సమయంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న రవి బిష్ణోయ్ కూడా బంతిని ఆపేందుకు వేగంగా దూసుకొచ్చాడు. సరిగ్గా అదే సమయానికి బుమ్రా కూడా బౌండరీ లైన్ వద్దకు వచ్చేశాడు. వీళ్లిద్దరూ గట్టిగా ఢీకొట్టుకోవాల్సింది. కానీ రవి బిష్ణోయ్ డైవ్ చేశాడు. ఒకవేళ బిష్ణోయ్ తగిలి ఉంటే బుమ్రా బొక్కాబోర్లా పడేవాడు. చివరి క్షణంలో అతడిపై నుంచి బుమ్రా జంప్ చేసి ప్రమాదం తప్పించుకున్నాడు.

Updated Date - 2023-08-19T18:53:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising