Australia: షాకింగ్ న్యూస్.. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్‌కు దీర్ఘకాలిక వ్యాధి
ABN, Publish Date - Dec 14 , 2023 | 02:33 PM
Cameron Green: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకు దీర్ఘకాలిక వ్యాధి ఉందని.. ఈ విషయం ఇప్పటివరకు దాచిపెట్టానని వివరించాడు. తాను చిన్నతనం నుంచే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని.. అయితే ఇది పూర్తిగా నయంకాని వ్యాధి అని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకు దీర్ఘకాలిక వ్యాధి ఉందని.. ఈ విషయం ఇప్పటివరకు దాచిపెట్టానని వివరించాడు. తాను చిన్నతనం నుంచే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని.. అయితే ఇది పూర్తిగా నయంకాని వ్యాధి అని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. తన తల్లికి 19 వారాల ప్రెగ్నెన్సీ సమయంలోని తనకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలిసిందని.. ఈ వ్యాధికి లక్షణాలు కూడా ఉండవని చెప్పాడు. ఈ వ్యాధిని ఆల్ట్రా సౌండ్‌తో గురించాల్సి ఉంటుందని.. ఇతరుల కిడ్నీల మాదిరిగా తన కిడ్నీలు పనిచేయలేవని కామెరూన్ గ్రీన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన కిడ్నీలు 60 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని.. తాను స్టేజీ-2లో ఉన్నట్లు గ్రీన్ తెలిపాడు.
కామెరూన్ గ్రీన్ ఎక్కువ రోజులు బతకడు అని తెలిసినా అతడి తండ్రి గ్యారీ కామెరూన్ తన కుమారుడికి క్రికెట్ కోచింగ్ ఇప్పించాడు. అతడు ఈ ఆటలో రాటుదేలడానికి ఎంతో కృషి చేశాడు. గ్రీన్ పుట్టిన తర్వాత ఇంక్యుబేటర్‌లో ఉంచామని అతడి తండ్రి వివరించాడు. కాగా కామెరూన్ గ్రీన్ గత ఏడాది నుంచి ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు. 2022లో టీ20లతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. గత నెలలో భారత్‌లో జరిగిన ODI ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు కూడా. ప్రస్తుతం పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్‌లో గ్రీన్ ఆడుతున్నాడు. గురువారం నుంచి ప్రారంభమైన పెర్త్ టెస్టులో తుది జట్టులో గ్రీన్‌కు చోటు దక్కలేదు. 24 ఏళ్ల గ్రీన్ ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌లో ఆర్సీబీ తరఫున బరిలోకి దిగనున్నాడు. గత ఏడాది ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన అతడిని ట్రేడింగ్ విండో ద్వారా ఆర్సీబీ కొనుగోలు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 14 , 2023 | 02:33 PM