IND vs AUS: భయపెడుతున్న ‘ఛేజింగ్’ సెంటిమెంట్.. భారత్ బ్రేక్ చేస్తుందా?
ABN, First Publish Date - 2023-11-19T15:28:18+05:30
సినిమాల తరహాలోనే క్రీడల్లోనూ ఎన్నో సెంటిమెంట్లను అనుసరిస్తుంటారు. మైదానంలోకి దిగినప్పటి నుంచి గెలుపుదాకా.. ఎన్నో సెంటిమెంట్లను ఆపాదిస్తుంటారు. ఇప్పుడు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ ఖప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ అలాంటి లెక్కలు వేసుకుంటున్నారు.
India vs Australia: సినిమాల తరహాలోనే క్రీడల్లోనూ ఎన్నో సెంటిమెంట్లను అనుసరిస్తుంటారు. మైదానంలోకి దిగినప్పటి నుంచి గెలుపుదాకా.. ఎన్నో సెంటిమెంట్లను ఆపాదిస్తుంటారు. ఇప్పుడు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ అలాంటి లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఫైనల్‌లో టీమిండియా గెలుస్తుందనే నమ్మకాలు భారతీయుల్లో గట్టిగానే ఉన్నాయి కానీ, కొన్ని నెగెటివ్ సెంటిమెంట్లు మాత్రం భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో ‘ఛేజింగ్’ సెంటిమెంట్ ఒకటి. 2011 వరల్డ్ కప్ నుంచి చూసుకుంటే.. ఛేజింగ్ చేసిన జట్లే ఫైనల్‌లో గెలుపొందాయే తప్ప, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచిన దాఖలాలు లేవు. దీంతో.. భారత్ విషయంలోనూ అదే రిపీట్ అవుతుందా? అని అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.
ఒకసారి 2011 వరల్డ్ కప్ ఫైనల్ నుంచి రిపోర్ట్ చూసుకుంటే.. ఆ మ్యాచ్‌లో శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఇక 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 48.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి, వరల్డ్ కప్‌ని లిఫ్ట్ చేసింది. అనంతరం 2015 వరల్డ్ ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ చూస్తే.. 45 ఓవర్లలోనే 183 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇక 184 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. 33.1 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ఇక 2019 వరల్డ్ కప్ ఫైనల్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అయితే.. లక్ష్యఛేధనలో ఇంగ్లండ్ జట్టు కూడా 241 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అప్పుడు సూపర్ ఓవర్ నిర్వహించగా.. ఇరు జట్లు కూడా 15 పరుగులే చేయడంతో మరోసారి ‘టై’ అయ్యింది. చివరికి ఎక్కువ ఫోర్లు కొట్టారన్న నెపంతో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం జరిగింది.
ఏది ఏమైనా.. 2011 నుంచి రిపోర్ట్ చూస్తే ఛేజింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో, భారత్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ తరుణంలోనే.. ఇక్కడ ‘ఛేజింగ్’ సెంటిమెంట్ ఏమైరా రిపీట్ అవుతుందా? అని భారత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. భారత్ ఫుల్ ఫామ్‌లో ఉంది కాబట్టి.. ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి, తప్పకుండా వరల్డ్ కప్ లిఫ్ట్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఆ నమ్మకాన్ని భారత్ నిలబెడుతుందా? లేకపోతే ‘ఛేజింగ్’ సెంటిమెంట్‌కి బలి అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
Updated Date - 2023-11-19T16:16:24+05:30 IST