ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPL Auction: రచిన్‌పై CSK అనాసక్తి.. డారిల్ మిచెల్‌కు గాలం వేస్తుందా?

ABN, Publish Date - Dec 18 , 2023 | 05:02 PM

IPL Auction: ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో రాణించిన రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్, గెరాల్డ్ కోయిట్జీ లాంటి ఆటగాళ్లు ఆసక్తి రేపుతున్నారు. వీరిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందోనని వెయిట్ చేస్తున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మాత్రం రచిన్ రవీంద్రపై ఎలాంటి ఆసక్తి లేదని ప్రచారం జరుగుతోంది.

ఐపీఎల్ మినీ వేలం మంగళవారం నాడు దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ వేలంలో అందరి కళ్లు స్టార్ ఆటగాళ్లపైనే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో రాణించిన రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్, గెరాల్డ్ కోయిట్జీ లాంటి ఆటగాళ్లు ఆసక్తి రేపుతున్నారు. వీరిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందోనని వెయిట్ చేస్తున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మాత్రం రచిన్ రవీంద్రపై ఎలాంటి ఆసక్తి లేదని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే చెన్నై జట్టుకు ప్రస్తుతం ఓపెనర్, స్పిన్ ఆల్‌రౌండర్ అవసరం లేదు. మిడిలార్డర్‌లో అంబటి రాయుడు లాంటి ఆటగాడు రిటైర్మెంట్ ఇవ్వడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయాలంటే మంచి అనుభవం ఉన్న మిడిలార్డర్ బ్యాటర్, పేస్ ఆల్‌రౌండర్ కావాలి. ఇప్పటికే రవీంద్ర జడేజా, మొయిన్ అలీ లాంటి స్పిన్ ఆల్‌రౌండర్లు చెన్నై జట్టుకు అందుబాటులో ఉన్నారు.

ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌కు చెందిన పేస్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్‌పై సీఎస్కే యాజమాన్యం దృ‌ష్టి సారించిందని.. అతడిని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ రచిన్ రవీంద్రను తీసుకుంటే ఓపెనింగ్‌లో మార్పులు చేయాల్సి వస్తుందని.. ప్రస్తుతం ఉన్న ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే నిలకడగా ఆడుతూ చెన్నై జట్టుకు విజయాలు చేకూరుస్తున్నారు. రహానె, శివం దూబె, మొయిన్ అలీలతో మిడిలార్డర్ కూడా ఫర్వాలేదు. కానీ రాయుడు రిటైర్మెంట్‌తో ఏర్పడిన ఖాళీని మాత్రం ఆల్‌రౌండర్‌తో భర్తీ చేయాలని సీఎస్కే భావిస్తోంది. ఒకవేళ డారిల్ మిచెల్ తమ బడ్జెట్‌లో రాకపోతే జాసన్ హోల్డర్, శార్దూల్ ఠాకూర్, షారుఖ్ ఖాన్, మనీష్ పాండే లాంటి ఆటగాళ్లను వేలంలో సొంతం చేసుకోవాలని చెన్నై యాజమాన్యం లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 18 , 2023 | 05:02 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising