ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. ఇంటికెళ్లిపోయిన కెప్టెన్!

ABN, First Publish Date - 2023-02-20T21:55:06+05:30

భారత్‌ చేతిలో రెండు వరుస పరాజయాలు చవిచూసిన పర్యాటక జట్టు ఆస్ట్రేలియా(Australia)కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌ చేతిలో రెండు వరుస పరాజయాలు చవిచూసిన పర్యాటక జట్టు ఆస్ట్రేలియా(Australia)కు మూడో టెస్టుకు ముందు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కుటుంబ ఆరోగ్య కారణాలతో ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins) ఇప్పటికే స్వదేశానికి పయనం కాగా, ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner), పేసర్ జోష్ హేజెల్‌వుడ్(Josh Hazlewood) కూడా సిరీస్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో సిరాజ్ బౌలింగులో బౌన్సర్లు వార్నర్ తలకి, చేతులకు తాకడంతో వార్నర్ కంకషన్ ఇంజ్యూరీకి గురయ్యాడు.

ఆ తర్వాత అతడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో మోతికి బలమైన గాయంతోపాటు ఫ్రాక్చర్ అయినట్టు తేలింది. గాయం నుంచి కోలుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో వార్నర్ కూడా స్వదేశం బాట పట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, గాయంతోనే ఇండియాలో అడుగపెట్టిన హేజిల్‌వుడ్ పూర్తిగా కోలుకోకపోవడంతో అతడు కూడా సిరీస్‌కు దూరమైనట్టు సమాచారం.

కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యం బారినపడడంతో స్వదేశం వెళ్లిన కమిన్స్ మూడో టెస్టు ప్రారంభమయ్యే సమయానికి తిరిగి రాకుంటే వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steven Smith) జట్టు పగ్గాలు అందుకుంటాడు. ఇక, గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమైన ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameron Green), మిచెల్ స్టార్క్ కోలుకోవడంతో మూడో టెస్టులో బరిలోకి దిగే అవకాశం ఉంది.

Updated Date - 2023-02-20T21:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising