ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi Capitals: వచ్చే ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఆడతాడా? లేదా?

ABN, First Publish Date - 2023-12-12T16:25:36+05:30

Rishab Pant: విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఆడతాడని ఢిల్లీ క్యాపిటల్స్ ధ్రువీకరించింది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడు కోలుకుంటున్నాడని.. తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడని డీసీ మేనేజ్‌మెుంట్ వెల్లడించింది.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. ఫ్రాంచైజీ పేరు మారినా ఆ జట్టు ఫేట్ మారడం లేదు. వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ రిషబ్ పంత్ దూరం కావడం ఆ జట్టు అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. గత ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా రోడ్డుప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడి క్రికెట్‌కు దూరమయ్యాడు. దీంతో జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే వచ్చే సీజన్‌లో అయినా పంత్ ఆడతాడా లేదా అన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఆడతాడని ఢిల్లీ క్యాపిటల్స్ ధ్రువీకరించింది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడు కోలుకుంటున్నాడని.. తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడని డీసీ మేనేజ్‌మెుంట్ వెల్లడించింది.

కాగా ఒకవేళ రిషబ్ పంత్ వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉన్నా అతడిని పూర్తిస్థాయిలో ఆడించే అవకాశాలు లేవని కొందరు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని మ్యాచ్‌లకు అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించినా.. వికెట్ కీపర్‌ బాధ్యతలు మాత్రం వేరే ఆటగాడికి కేటాయిస్తారని సమాచారం అందుతోంది. కొన్ని మ్యాచ్‌లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా రిషబ్ పంత్ బరిలోకి దిగే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. గత సీజన్‌కు రిషబ్ పంత్ దూరం కావడంతో అతడి స్థానంలో డేవిడ్ వార్నర్ సారథ్యం వహించాడు. అయితే అతడి కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ అంచనాల మేరకు రాణించలేకపోయింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో వచ్చే సీజన్‌లో అయినా సత్తా చాటాలని.. ఛాంపియన్‌గా నిలవాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఉవ్విళ్లూరుతోంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-12T16:26:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising