ENG Vs NZ: వన్డే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
ABN, First Publish Date - 2023-10-05T17:46:29+05:30
వన్డే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ఫర్వాలేదనిపించే స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.
వన్డే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ఫర్వాలేదనిపించే స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. 40 పరుగులకే ఓపెనర్ డేవిడ్ మలాన్ అవుట్ కాగా 64 పరుగుల వద్ద మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో పెవిలియన్ చేరాడు. అయితే జో రూట్ పరిణితితో చెందిన ఇన్నింగ్స్ ఆడాడు. 86 బాల్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 77 పరుగులు చేశాడు. అయితే మిగతా వాళ్లు నిలకడగా ఆడలేకపోయారు. కెప్టెన్ జాస్ బట్లర్ 43 పరుగులు చేశాడు. విశేషం ఏమంటే ఇంగ్లండ్ బ్యాటర్లందరూ డబుల్ డిజిట్ స్కోరు చేశారు. లోయరార్డర్‌లో ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ కూడా బ్యాట్ ఝళిపించారు.
ఇది కూడా చదవండి: World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ సెక్రటరీ జైషా
న్యూజిలాండ్ బౌలర్లు సమష్టిగా రాణించారు. ముఖ్యంగా స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ చెలరేగిపోయాడు. అతడు 10 ఓవర్లు వేసి 37 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాట్ హెన్రీ మాత్రం మూడు వికెట్లు సాధించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్, రచిన్ రవీంద్ర తలో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే న్యూజిలాండ్ 283 పరుగులు చేయాలి. విలియమ్సన్ లేకపోవడంతో కివీస్ ఎలా బ్యాటింగ్ చేస్తుందో వేచి చూడాలి. కాగా ట్రెంట్ బౌల్డ్ వేసిన 12వ ఓవర్‌లో జో రూట్ రిస్క్ చేస్తూ రివర్స్ స్కూప్ ఆడి సిక్సర్ కొట్టడం ఈ మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది.
Updated Date - 2023-10-05T17:47:54+05:30 IST