ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ind vs Aus: భారత్‌లో దయనీయంగా ఆసీస్ పరిస్థితి! .. ఈ 4 మ్యాచ్‌ల రికార్డులు చూస్తే చాలు..

ABN, First Publish Date - 2023-02-19T17:32:40+05:30

థర్డ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో ఆస్ట్రేలియాకు ఇది ఐదో అత్యల్ప స్కోరు. భారత్‌ జట్టు చేతిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు(India) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. థర్డ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో ఆస్ట్రేలియాకు ఇది ఐదో అత్యల్ప స్కోరు.

* 2013లో హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్ల ప్రదర్శన చేసి ఆసీస్‌ను కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయంసాధించింది.

* 2017లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ మాయాజాలం ముందు కంగారూ జట్టు నిలవలేకపోయింది. ఆ మ్యాచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఫలితంగా ఆసీస్ 112 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.

* 2004లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ సింగ్, మురళీ కార్తీక్ మెరిశారు. వారిద్దరూ పోటీలు పడి వికెట్లు తీయడంతో నాలుగో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 93 పరగులకే చాపచుట్టేసింది. హర్భజన్ సింగ్ 5 వికెట్లు, కార్తీక్ మూడు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా 13 పరుగుల తేడాతో ఇండియా విజయాన్ని అందుకుంది. కార్తీక్ ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌తోనే గౌతం గంభీర్, దినేశ్ కార్తీక్, నాథన్ హారిట్జ్ టెస్టు అరంగేట్రం చేశారు.

* బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ ఏడాది నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే ఆలౌట్ అయింది. మూడో రోజు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కలిసి ఆసీస్ భరతం పట్టారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 177 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 21వ శతాబ్దంలో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

Updated Date - 2023-02-19T18:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising