ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gautham Gambhir: రోహిత్ శర్మపై విమర్శలు.. దేశం కోసం ఆడుతూ అలా అనడం సరికాదు

ABN, First Publish Date - 2023-11-29T16:49:22+05:30

Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్‌కు ముందు రోహిత్ చేసిన వ్యాఖ్యలను ఓ ఇంటర్వ్యూలో గంభీర్ ప్రస్తావించాడు. వన్డే ప్రపంచకప్‌ను ఓ వ్యక్తి (కోచ్ ద్రవిడ్) కోసం గెలుస్తామని రోహిత్ అన్నాడని.. కానీ దేశం కోసం ఆడుతూ రోహిత్ ఇలా అనడం సరికాదని గంభీర్ ఆరోపించాడు. ఇలాంటి స్టేట్‌మెంట్ రోహిత్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదని సూచించాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్‌కు ముందు రోహిత్ చేసిన వ్యాఖ్యలను ఓ ఇంటర్వ్యూలో గంభీర్ ప్రస్తావించాడు. వన్డే ప్రపంచకప్‌ను ఓ వ్యక్తి (కోచ్ ద్రవిడ్) కోసం గెలుస్తామని రోహిత్ అన్నాడని.. కానీ దేశం కోసం ఆడుతూ రోహిత్ ఇలా అనడం సరికాదని గంభీర్ ఆరోపించాడు. ఇలాంటి స్టేట్‌మెంట్ రోహిత్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదని సూచించాడు. 2011లోనూ తనను ఓ జర్నలిస్ట్ ఇలాగే అడిగాడని.. సచిన్ కోసం వరల్డ్ కప్ గెలుస్తారా అని అడిగితే.. తాను దేశం కోసం గెలుస్తానని చెప్పానని గంభీర్ గుర్తుచేశాడు. ఒకవేళ మీడియాతో చెప్పకుండా వ్యక్తిగతంగా చెప్తే సమస్య లేదని.. కానీ మీడియా ముందు ఒక వ్యక్తి కోసం గెలుస్తామని చెప్పడం అభిమానులను అవమానపర్చడమేనని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

అటు వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుతంగా ఆడిందని.. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడిపోయిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అయితే టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం పొడిగింపునకు టీమిండియా ప్రదర్శనే కారణం. ద్రవిడ్‌ను వద్దు అని చెప్పడానికి వీల్లేని పరిస్థితి. కేవలం ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన ద్రవిడ్‌ను కోచ్‌గా తీసివేయాలని భావించడం కరెక్ట్ కాదు. ప్రతి మ్యాచ్‌లో గెలవాలని ఆటగాళ్లు భావించినట్లే.. ప్రతి మ్యాచ్‌లో తమ జట్టును గెలిపించాలని కోచ్‌లు కృషి చేస్తారు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని గంభీర్ అన్నాడు. కోచ్‌గా ద్రవిడ్ మరో రెండేళ్లు కొనసాగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు గంభీర్ పేర్కొన్నాడు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-29T16:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising