ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gautham Gambhir: ఇవేం దిక్కుమాలిన ప్రయోగాలు..? నంబర్‌వన్ బౌలర్ ఎక్కడ?

ABN, First Publish Date - 2023-12-13T14:55:43+05:30

Gautham Gambhir: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓడిపోవడంపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కూర్పుపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు చాలా తక్కువ మ్యాచ్‌లు ఉన్నాయని.. అలాంటి సమయంలో ఇలాంటి ప్రయోగాలు ఏంటని మండిపడ్డాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓడిపోవడంపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కూర్పుపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు చాలా తక్కువ మ్యాచ్‌లు ఉన్నాయని.. అలాంటి సమయంలో ఇలాంటి ప్రయోగాలు ఏంటని మండిపడ్డాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్‌ను ఎందుకు పక్కన పెట్టారో తనకు అర్థం కావడం లేదని గంభీర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో ఆడిన చివరి టీ20లో శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాడని.. లెఫ్ట్ హ్యాండర్ కోసం శ్రేయాస్‌ను పక్కనపెట్టారా లేదా అతడికి గాయమైందా అని టీమ్ మేనేజ్‌మెంట్‌ను గంభీర్ ప్రశ్నించాడు. అటు నంబర్‌వన్ బౌలర్ రవి బిష్ణోయ్‌ను తుది జట్టు ఎందుకు తప్పించారో చెప్పాలన్నాడు. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్, టీమ్ మేనేజ్‌మెంట్ క్లారిటీ ఇవ్వాలని గంభీర్ స్పష్టం చేశాడు.

కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ గొప్పగా రాణించాడని మాజీ ఆటగాడు పీయూష్ చావ్లా గుర్తుచేశాడు. అంతేగాక ఐసీసీ ర్యాంకుల్లో టాప్‌లో నిలిచాడని.. అతడిని జట్టులో ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. నంబర్‌వన్ బౌలర్‌ను బెంచ్‌కు పరిమితం చేయడం అతడిపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని పీయూష్ చావ్లా అన్నాడు. మరోవైపు ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా టీమిండియా కూర్పుపై పలు ప్రశ్నలు లేవనెత్తాడు. మూడో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ బదులుగా తిలక్ వర్మను పంపడం తనకు ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. తుది జట్టులో శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడం అసంతృప్తికి గురిచేసిందని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-13T14:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising