ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మణికట్టుకు ఫ్రాక్చర్.. ఎడమచేత్తో బ్యాటింగ్ చేసిన హనుమ విహారి

ABN, First Publish Date - 2023-02-01T17:24:19+05:30

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)తో జరుగుతున్న రంజీ ట్రోఫీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కెప్టెన్ హనుమ విహారి (Hanuma Vihari) అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆటపై అతడికున్న అంకితభావానికి నిదర్శనంగా నిలిచాడు. మణికట్టుకు గాయం కావడంతో మైదానాన్ని వీడిన విహారి చివర్లో మళ్లీ క్రీజులోకి వచ్చి ఎడమ చేత్తో బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మధ్యప్రదేశ్ పేసర్ అవేష్ ఖాన్ (Avesh Khan) వేసిన బంతి విహారి ఎడమ చేతికి బలంగా తాకడంతో విలవిల్లాడిన హనుమ విహారి బాధతో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఎక్స్‌రే తీయగా మణికట్టు వద్ద ఫ్రాక్చర్ అయినట్టు తేలింది. అయితే, ఇదేమీ పట్టించుకోని విహారి.. పృథ్వీరాజ్ యర్రా (2) తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత మళ్లీ క్రీజులోకి వచ్చి జట్టుపై తనకున్న అంకితభావాన్ని చాటుకున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన విహారీ.. గాయమైన తన ఎడమ చేతి మణికట్టును రక్షించుకునేందుకు ఈసారి ఎడమ చేత్తో బ్యాటింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విహారి గతేడాది వరకు భారత జట్టు(Team India)లో కీలకంగా ఉన్నాడు. అయితే, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్‌ అద్భుతంగా రాణిస్తుండడంతో విహారికి జట్టులో చోటు కరువైంది. త్వరలోనే ఆస్ట్రేలియాతో జరగనున్న 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ విహారికి చోటు దక్కలేదు.

కాగా, తాజా మ్యాచ్‌లో 16 పరుగుల వద్ద గాయంతో క్రీజును వదిలిన విహారి మళ్లీ చివర్లలో వచ్చి 11 పరుగులు సాధించాడు. మొత్తంగా 57 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. ఆంధ్రప్రదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ భుయి(149), కరణ్ షిండే 110) సెంచరీలతో అదరగొట్టారు. మణికట్టుకు గాయమైనట్టు తేలడంతో ఐదు నుంచి ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరమని విహారితో వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది.

విహారి ఎడమ చేత్తో బ్యాటింగ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. ధైర్యానికి మరో ఉదాహరణ అని కామెంట్ చేశాడు. ‘ఫైటర్ విహారి’ అని ఒకరు, యోధుడని ఒకరు ప్రశంసలు కురిపించారు.

Updated Date - 2023-02-01T17:24:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising