ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Harry Brook: ప్రపంచ క్రికెట్‌పై ‘బ్రూక్’ బ్రాండ్.. పరుగుల రారాజు

ABN, First Publish Date - 2023-02-24T17:37:21+05:30

ఆడుతున్నది 6వ టెస్టు మాత్రమే.. కానీ, వందో మ్యాచ్ తరహాలో ఆధిపత్యం..నిలకడకు నిలువెత్తు రూపం అన్నట్లుగా ఫామ్.. మూడు ఫార్మాట్లలోనూ అదే దూకుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆడుతున్నది 6వ టెస్టు మాత్రమే.. కానీ, వందో మ్యాచ్ తరహాలో ఆధిపత్యం..నిలకడకు నిలువెత్తు రూపం అన్నట్లుగా ఫామ్.. మూడు ఫార్మాట్లలోనూ అదే దూకుడు.. బాదుడుకు తన జట్టు కొత్త అర్థం చెబుతుంటే.. దానికి మించిన నిర్వచనం ఇస్తున్నాడు ఆ క్రికెటర్. హ్యాట్రిక్ సహా గత ఐదు టెస్టుల్లో నాలుగు సెంచరీలు.. మరో దాంట్లో త్రుటిలో మూడంకెల స్కోరు మిస్.. అంతేనా.. ఇవన్నీ సొంతగడ్డపై కాదు విదేశీ పిచ్ లపై చేసినవే.

క్రీజులో మూడంకెల రంకెలు..

ఒకప్పుడు డాన్ బ్రాడ్ మన్ గురించి గొప్పగా చెప్పుకొన్నాం.. సచిన్ టెండూల్కర్ గురించి కళ్లారా చూశాం.. విరాట్ కోహ్లీ రికార్డులను ఆనందించాం.. వీరితో పోల్చడం తొందరపాటే అవుతుంది కానీ ఇంగ్లండ్(England) యువ బ్యాట్స్‌మన్ హ్యారీ బ్రూక్(Harry Brook) సంచలనాలనే నమోదు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా టెస్టుల్లో ఆకాశమే హద్దు అన్నంతగా చెలరేగుతున్నాడు. 153.. 87.. 108... 111... 89... 54... 184 (బ్యాటింగ్) గత ఐదు టెస్టుల్లో అతడి స్కోర్లు ఇవి. వీటిని చూసి చెప్పొచ్చు బ్రూక్ ప్రదర్శన ఎలాంటిదో?

న్యూజిలాండ్(New Zealand)తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో అతడు అలవాటైన రీతిలో సెంచరీ కొట్టేశాడు. గతేడాది సెప్టెంబరు నుంచి 6 టెస్టులాడిన బ్రూక్ కేవలం 9 ఇన్నింగ్స్ ల్లోనే 807 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరో విశేషం ఏమంటే ప్రస్తుతం అతడి సగటు 100.88. ఒక్క గావస్కర్(Gavaskar)కు మాత్రమే 9 ఇన్నింగ్స్‌ల తర్వాత ఈ స్థాయి సగటు (129.66) ఉంది. మరోవైపు శుక్రవారం న్యూజిలాండ్‌తో మొదలైన రెండో టెస్టులో బ్రూక్ 169 బంతుల్లో 184 నాటౌట్ (24 ఫోర్లు, 5 సిక్స్లులు) కొట్టాడు.

పాక్ గడ్డపై ప్రతాపం

అటు పేస్, ఇటు స్పిన్ రెండిండ్లోనూ దమ్మున్న జట్టు పాకిస్థాన్(Pakistan). అలాంటి జట్టుతో ఇంగ్లండ్ ఇటీవల మూడు టెస్టుల సిరీస్ ఆడింది. ఉప ఖండ పరిస్థితుల్లో విదేశీ బ్యాట్స్ మెన్ పరుగులు చేయడం.. అది కూడా టెస్టుల్లో అంటే సాధారణ విషయం కాదు. అందులోనూ 18 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఆడుతుండడంతో ఇంగ్లండ్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనన్న అనుమానాలుండేవి. అయితే, బ్రూక్ దూకుడుతో ఇంగ్లండ్ పని సులువైపోయింది. ఆ సిరీస్ లో మూడు టెస్టుల్లోనూ బ్రూక్ సెంచరీలు (153,108, 111) కొట్టాడు. టి20ల్లోనూ చెలరేగి ఆడుతున్న అతడిని అడ్డుకోవడం ఓ దశలో పాక్ బౌలర్లకు ఎలాగో తెలియరాలేదు.

30 ఏళ్ల నాటి మనోడి రికార్డు బద్దలు

న్యూజిలాండ్ తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో బ్రూక్ మరో సెంచరీ కొట్టాడు. ఈ క్రమంలో 30 ఏళ్ల కిందట టీమిండియా క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli) నెలకొల్పిన రికార్డును బద్దులకొట్టాడు. 9 టెస్టు ఇన్నింగ్స్ ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. 800 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్ గానూ రికార్డులకెక్కాడు. 1990ల్లో టీమిండియా తరఫున కొన్నాళ్లు అద్భుతంగా రాణించి.. ఆపై అనూహ్యంగా కనుమరుగైన క్రికెటర్ కాంబ్లీ తొలి 9 ఇన్నింగ్స్ లో 798 పరుగులు చేశాడు.ఇందులో నాలుగు సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు కాంబ్లీ రికార్డును బ్రూక్ దాటేశాడు.

భారత్, వెస్టిండీస్ దిగ్గజాలు సునీల్ గావస్కర్ (9 ఇన్నింగ్స్ లో 778 పరుగులు), ఎవర్టన్ వీక్స్ (9 ఇన్నింగ్స్ లో 777 పరుగులు)ను వెనక్కునెట్టాడు. కాగా, బజ్‌బాల్ అంటూ టెస్టులను వన్డేల్లా ఆడుతున్నఇంగ్లండ్ క్రికెట్‌లో బట్లర్, బెయిర్ స్టో, రూట్, స్టోక్స్ గురించి చెప్పుకొనేవారు. బ్రూక్ ఇదే నిలకడ కొనసాగిస్తే అంతా అతడి గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ స్థాయిలోప్రపంచ క్రికెట్‌లో రాణిస్తున్న క్రికెటర్ల కేవలం ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. వారు టీమిండియా సంచలనం శుభ్‌మన్ గిల్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్. అయితే, వీరందరినీ మించి పరుగులు చేస్తుండడం బ్రూక్ ప్రత్యేకత.

Updated Date - 2023-02-24T17:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising