ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI Strike Rate 2023: వన్డేల్లో క్లాసెన్ అరుదైన రికార్డు.. ఈ ఏడాది అగ్రస్థానం అతడిదే

ABN, Publish Date - Dec 22 , 2023 | 05:29 PM

దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల విషయంలో ఈ ఏడాది అత్యధిక స్ట్రెయిక్ రేట్ కలిగిన ఆటగాడిగా క్లాసెన్ నిలిచాడు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో క్లాసెన్ 140.66 స్ట్రెయిక్ రేటును కలిగిన ఆటగాడిగా నిలిచాడు.

దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల విషయంలో ఈ ఏడాది అత్యధిక స్ట్రెయిక్ రేట్ కలిగిన ఆటగాడిగా క్లాసెన్ నిలిచాడు. 2023లో దక్షిణాఫ్రికా ఆడాల్సిన వన్డేలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ క్యాలెండర్ ఇయర్‌లో క్లాసెన్ 140.66 స్ట్రెయిక్ రేటును కలిగిన ఆటగాడిగా నిలిచాడు. వన్డేల చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో కనీసం 900 పరుగులు చేసిన ఆటగాళ్లలో క్లాసెన్‌దే అత్యధిక స్ట్రెయిక్ రేట్ కావడం గమనించాల్సిన విషయం. ఈ జాబితాలో క్లాసెన్ తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ (137.91), ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్ స్టో (118.22), టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ (117.07), శ్రీలంక మాజీ ఆటగాడు జయసూర్య (113.59), దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్‌క్రమ్ (113.26), ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ (112.66) ఉన్నారు.

ఏబీ డివిలియర్స్ 2015లో, జానీ బెయిర్ స్టో 2018లో, రోహిత్ శర్మ 2023లో, సనత్ జయసూర్య 1997లో, మార్‌క్రమ్ 2023లో, డేవిడ్ వార్నర్ 2023లో ఈ ఫీట్ సాధించారు. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో క్లాసెన్, రోహిత్ శర్మ, మార్‌క్రమ్, డేవిడ్ వార్నర్ విశేషంగా రాణించారు. దీంతో ఆయా ఆటగాళ్లు అత్యుత్తమ స్ట్రెయిక్ రేట్ సాధించారు. కాగా ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న క్లాసెన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 22 , 2023 | 07:29 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising