IPL Auction 2024: వేలం బరిలో 333 మంది ప్లేయర్స్.. ఏ జట్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..?
ABN, First Publish Date - 2023-12-12T15:01:01+05:30
IPL Auction 2024: వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించి మినీ వేలానికి సమయం ఆసన్నమవుతోంది. డిసెంబర్ 19న బెంగళూరు వేదికగా ఐపీఎల్ వేలం జరగనుంది. అయితే ఏ జట్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఏ జట్టు ఎక్కువగా ఆటగాళ్లను కొనుగోలు చేయనుందన్న విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.
వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించి మినీ వేలానికి సమయం ఆసన్నమవుతోంది. డిసెంబర్ 19న బెంగళూరు వేదికగా ఐపీఎల్ వేలం జరగనుంది. అయితే ఏ జట్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఏ జట్టు ఎక్కువగా ఆటగాళ్లను కొనుగోలు చేయనుందన్న విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో వేలం బరిలో 333 మంది ఆటగాళ్లు ఉండగా.. మొత్తం 77 ఖాళీలు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. అంటే 77 మంది ఆటగాళ్లనే అదృష్టం వరించనుంది. ఆయా ఆటగాళ్లు కోట్లకు కోట్లు ఆర్జించే అవకాశం కనిపిస్తోంది. ప్రతి జట్టులో అత్యధికంగా 25 మంది ఆటగాళ్లు మాత్రమే ఉండాలని నియమం ఉంది. వీరిలో అత్యధికంగా 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు.
ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీల్లో ఖాళీలను పరిశీలిస్తే.. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో 12 ఖాళీలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో 9 ఖాళీలు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లలో 8 ఖాళీల చొప్పున ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లలో ఆరు ఖాళీల చొప్పున ఉన్నట్లు తెలుస్తోంది. ఖాళీలతో పాటు పర్స్ వాల్యూ కూడా ఫ్రాంచైజీలకు కీలకంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అత్యధికంగా రూ.31.4 కోట్ల పర్స్ ఉంది. దీంతో ఆ జట్టు కీలక ఆటగాళ్లకు గాలం వేసే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.28.95 కోట్ల పర్స్ ఉంది. గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.38.15 కోట్ల పర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద రూ.32.7 కోట్ల పర్స్, లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.13.5 కోట్ల పర్స్, ముంబై ఇండియన్స్ వద్ద రూ.17.75 కోట్ల పర్స్, పంజాబ్ కింగ్స్ వద్ద రూ.29.1 కోట్ల పర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.23.25 కోట్ల పర్స్, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.14.5 కోట్ల పర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.34 కోట్ల పర్స్ ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-12T15:01:02+05:30 IST