ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Imran Khan: ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లను అనుమతించకపోవడంపై ఇమ్రాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ABN, First Publish Date - 2023-04-01T18:30:06+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో పాకిస్థాన్(Pakistan) ప్లేయర్లను అనుమతించకపోవడంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇస్లామాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో పాకిస్థాన్(Pakistan) ప్లేయర్లను అనుమతించకపోవడంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో పాక్ ప్లేయర్లను అనుమతించకపోవడంపై చింతించాల్సిన పనిలేదన్నారు. 2008 ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు భాగమయ్యారు. అయితే, ముంబై పేలుళ్ల తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడం, సంబంధాలు దెబ్బతినడంతో పాక్ ప్లేయర్లపై బీసీసీఐ నిషేధం విధించింది.

‘టైమ్స్ రేడియో’తో ఇమ్రాన్ తాజాగా మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో ఆడేందుకు పాకిస్థాన్ ఆటగాళ్లను అనుమతించకపోవడం తనకు వింతగా అనిపిస్తోందన్నారు. అయితే, తమ ఆటగాళ్లను ఆడించనంత మాత్రాన పాకిస్థాన్ బాధపడాల్సి అవసరం ఏమీ లేదని పేర్కొన్నారు. డబ్బులు బాగా సంపాదిస్తుండడంతో భారత క్రికెట్‌బోర్డు అహంకారిగా మారిందని విమర్శించారు.

క్రికెట్ ప్రపంచంలో భారత్ ఇప్పుడు సూపర్ పవర్‌గా ఉందని, ఇతర దేశాల కంటే ఎక్కువ డబ్బులు వచ్చి పడుతుండడంతో దాని ప్రవర్తన అహంకారంగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బు సంపాదించే సామర్థ్యం కారణంగా ఎవరిని ఆడించాలి? ఎవరిని ఆడించకూడదు? అన్న విషయాన్ని అది నిర్ణయిస్తోందని ఇమ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-01T18:30:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising