IND vs AUS: ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా రోహిత్‌కు ఇలా జరగడం ఇదే తొలిసారి..
ABN, First Publish Date - 2023-03-19T21:11:20+05:30
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో రోహిత్
విశాఖపట్నం: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు(Team India)కు దారుణ పరాభవం ఎదురైంది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రోహిత్ శర్మ(Rohit Sharma) డిసెంబరు 2021లో విరాట్ కోహ్లీ(Virat Kohli) నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. స్వదేశంలో రోహిత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 35 ఏళ్ల రోహిత్ కెప్టెన్‌గా 9 వరుస వన్డేల్లో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఏడాది కూడా స్వదేశంలో వరుసగా ఆరు వన్డేల్లో భారత జట్టు విజయం సాధించింది. శ్రీలంక, న్యూజిలాండ్‌లను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
రోహిత్‌కు కెప్టెన్‌గా ఆరేళ్లలో స్వదేశంలో ఇదే తొలి ఓటమి. చివరిసారి డిసెంబరు 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. కోహ్లీ గైర్హాజరీలో అప్పట్లో జట్టుకు రోహిత్ స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ స్టాండిన్ కెప్టెన్సీ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. పదింటిలో 8 మ్యాచుల్లో జట్టుకు విజయాన్ని అందించిపెట్టాడు.
రోహిత్ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా ఉన్న మూడు మ్యాచుల్లో భారత జట్టు ఓటమి పాలైంది. అయితే, అవన్నీ విదేశాల్లోనే. స్వదేశంలో మాత్రం ఇదే మొదటిది. అంతేకాదు, గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ రోహిత్ సారథ్యంలోని భారత జట్టు పరాజయం పాలైంది. రోహిత్ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత జట్టు ఓడింది. ఆ సిరీస్‌ను భారత జట్టు 2-1తో చేజిక్కించుకుంది.
Updated Date - 2023-03-19T21:12:10+05:30 IST