India vs New Zealand: కష్టాల్లో భారత్.. హార్దిక్, సూర్య ఉన్నారన్న ధీమా
ABN, First Publish Date - 2023-01-27T21:27:29+05:30
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. 15 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
రాంచీ: న్యూజిలాండ్(New Zealand)తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు(Team India) కష్టాల్లో పడింది. 15 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు 10 పరుగుల వద్ద తొలి దెబ్బ తగిలింది. 4 పరుగులు చేసిన ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)ను బ్రాస్‌వెల్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠీ కూడా క్రీజులో కుదురుకోలేకపోయాడు.
6 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే జాకోబ్ డుఫీ బౌలింగులో పెవిలియన్ చేరాడు. మరో నాలుగు పరుగులు జోడించాక 15 పరుగుల వద్ద మరో ఓపెనర్ శుభమన్ గిల్(Shubman Gill) (7) అవుటయ్యాడు. దీంతో 15 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిశాయి. భారత్ మూడు వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (17), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ క్రీజులో సూర్యకుమార్, పాండ్యా ఉండడంతో అభిమానులు ధీమాగా ఉన్నారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ 35, కాన్వే 52, డరిల్ మిచెల్ 59 పరుగులు చేశారు.
Updated Date - 2023-01-27T21:35:55+05:30 IST