ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Suryakumar Yadav: ఆ సూర్యకు బదులు.. ఈ సంజూని ఆడించండయ్యా!

ABN, First Publish Date - 2023-03-23T18:35:03+05:30

ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) దారుణంగా విఫలమయ్యాడు. మూడు వన్డేల్లో ఆడిన తొలి బంతికే వెనుదిరిగాడు. దీంతో అతడి పేలవ ప్రదర్శనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20ల్లో దుమ్మురేపే సూర్య.. వన్డేల్లో ఇలా చతికిల పడడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అంతేకాదు, వరుసగా మూడు వన్డేల్లోనూ డకౌటై ఓ చెత్త రికార్డును సూర్యకుమార్ మూటగట్టుకున్నాడు.

సూర్యపై దుమ్మెత్తి పోస్తున్న అభిమానులు ఇప్పటికైనా మించిపోయింది లేదని, సంజూ శాంసన్‌(Sanju Samson)ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంజు 11 వన్డేల్లో 66 సగటుతో 330 పరుగులు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో సూర్యకుమార్ 23 మ్యాచుల్లో 24.05తో 433 పరుగులు మాత్రమే చేశాడు.

సూర్య వరుస వైఫల్యాలపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్(Wasim Jaffer) స్పందించాడు. సూర్యకుమార్ దురదృష్టంపై సానుభూతి చూపించిన జాఫర్.. అతడి స్థానంలో మరొకరిని చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. వన్డేల విషయానికి వస్తే సూర్యకుమార్ ఉన్న సమయంలో సంజులాంటి ఆటగాడు జట్టులోకి రావాలని అభిప్రాయపడ్డాడు. సూర్యకు మరోమారు అలాంటి అనుభవం ఎదురుకాకూడదని ఆకాంక్షించాడు. ఇలా జరగడం అతడి దురదృష్టం తప్ప మరోటి కాదన్నాడు. ఏదిఏమైనప్పటికీ ఇండియా మరో ఆటగాడి కోసం చూడాల్సిన అవసరం ఉందన్నాడు.

సూర్యకుమార్ మంచి క్వాలిటీ ప్లేయర్ అని, ఐపీఎల్‌(IPL)కు చక్కగా పనికొస్తాడన్నాడు. భారత జట్టు సంజూ శాంసన్‌ వైపు చూడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. అయితే, సూర్య నాణ్యమైన ఆటగాడు కాబట్టి అతడిని పక్కనపెట్టాల్సిన అవసరం కూడా లేదన్నాడు. ఐపీఎల్‌లో అతడు బాగా ఆడితే మళ్లీ జట్టులో ఆడించొచ్చని, ఏదిఏమైనప్పటికీ సంజు వైపు కూడా చూడాల్సిన అవసరం ఉందని జాఫర్ నొక్కి చెప్పాడు.

Updated Date - 2023-03-23T18:35:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising